జర నవ్వండి ప్లీజ్ 70
రచయిత – నాకు రచనా శక్తి లేదని నేను తెలుసుకోవడానికి నాకు అరవయ్యేళ్లు పట్టింది మిత్రుడు – మరి రచనలు చెయ్యడం ఎందుకు మానెయ్య లేదు? రచయిత – ఇంత గొప్ప రచయితగా పేరొచ్చాక ఎలా మానెయ్యమంటావు? ——————————— సముద్రంలో మునిగిపోతున్న మనిషి – రక్షించండి… రక్షించండి నాకు ఈత రాదు పక్కనే పడవలో ఉన్న మనిషి – అంత గట్టిగా అరిచి గీపెట్టాల్సిన పనేముంది? నాకు గిటార్ వాయించడం రాదు. ఐతే అంత గట్టిగా నాకు […]
BY Pragnadhar Reddy1 May 2015 1:22 AM IST
Pragnadhar Reddy Updated On: 30 April 2015 4:34 PM IST
రచయిత – నాకు రచనా శక్తి లేదని నేను తెలుసుకోవడానికి నాకు అరవయ్యేళ్లు పట్టింది
మిత్రుడు – మరి రచనలు చెయ్యడం ఎందుకు మానెయ్య లేదు?
రచయిత – ఇంత గొప్ప రచయితగా పేరొచ్చాక ఎలా మానెయ్యమంటావు?
———————————
సముద్రంలో మునిగిపోతున్న మనిషి – రక్షించండి… రక్షించండి నాకు ఈత రాదు
పక్కనే పడవలో ఉన్న మనిషి – అంత గట్టిగా అరిచి గీపెట్టాల్సిన పనేముంది? నాకు గిటార్ వాయించడం రాదు. ఐతే అంత గట్టిగా నాకు గిటార్ వాయించడం రాదు అని అరిచానా?
———————————-
కొత్త పెళ్లి కొడుకు – డియర్ ! నా అసహ్యమైన ముఖాన్ని జీవితమంతా చూస్తూ గడపాలి నువ్వు!
పెళ్లి కూతురు – అబ్బే! నువ్వేం దిగులు పడకు! పొద్దున ఉద్యోగానికి వెళ్లి రాత్రి దాకా తిరిగిరావు కదా!
———————————–
సుమంత్ గిటారు వాయిస్తున్నాడు. అనంత్ వింటున్నాడు
సుమంత్ ఆపి ఎలా వాయిస్తున్నాను? అన్నాడు
అనంత్ – అద్భుతం నువ్వు టీవీ ప్రోగ్రాం ఇవ్వొచ్చు
సుమంత్ – ఉత్సాహంగా – అంతగా బాగా వాయిస్తున్నానా?
అనంత్ – కాదు అక్కడ నేను ఛానల్ మార్చే అవకాశం ఉంది.
Next Story