సహకార రంగంలోకి నిజాం షుగర్స్!
నిజాం షుగర్స్‌ను టేకొవర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజాం షుగర్స్ పరిధిలో ఉన్న ఫ్యాక్టరీలన్నింటిని ఇకముందు సహకార రంగంలో నడపాలని భావిస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని షక్కర్ నగర్ షుగర్ యూనిట్‌ను, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని షుగర్ యూనిట్, మెదక్ జిల్లాలోని మాంబోజీపల్లి షుగర్ యూనిట్‌ను సహకార రంగంలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల బకాయిలు, ఉద్యోగులకు వేతనాలు, రుణదాతలకు చెల్లింపుల విషయంలో చాలాకాలం నుంచి ఇవి ఇబ్బందులు పడుతున్నాయి. నిజాం షుగర్స్‌లో 51 శాతం […]
BY admin30 April 2015 7:53 AM IST
X
admin Updated On: 30 April 2015 12:38 PM IST
నిజాం షుగర్స్‌ను టేకొవర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజాం షుగర్స్ పరిధిలో ఉన్న ఫ్యాక్టరీలన్నింటిని ఇకముందు సహకార రంగంలో నడపాలని భావిస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని షక్కర్ నగర్ షుగర్ యూనిట్‌ను, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని షుగర్ యూనిట్, మెదక్ జిల్లాలోని మాంబోజీపల్లి షుగర్ యూనిట్‌ను సహకార రంగంలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల బకాయిలు, ఉద్యోగులకు వేతనాలు, రుణదాతలకు చెల్లింపుల విషయంలో చాలాకాలం నుంచి ఇవి ఇబ్బందులు పడుతున్నాయి. నిజాం షుగర్స్‌లో 51 శాతం భాగస్వామిగా ఉన్న డెల్టా పేపర్ మిల్స్‌కు పరిహారం చెల్లింపు, టేకొవర్ మార్గదర్శకాల రూపకల్పన తదితర అంశాల పరిశీలనకు ఓ కమిటీని నియమించింది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని… మార్గదర్శకాల రూపకల్పన పూర్తయ్యాక రైతులను ఈ కర్మాగారాల్లో భాగస్వాములుగా చేయడానికి వీలుగా సహకార రంగంలోకి వీటిని పూర్తిగా మార్చి నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తారు. మూడు నెలలలోగా ఈ కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చంద్రబాబు హయాంలోనే నిజాంకు తూట్లు…
ఒకప్పుడు తెలంగాణకు తలమానికంగా ఉన్న నిజాం షుగర్స్‌ను ఉమ్మడి రాష్ర్ట సీఎంగా ఉన్న కాలంలో చంద్రబాబు ప్రయివేటు వ్యక్తులకు అమ్మివేశారు. ప్రభుత్వ ఆస్తులను తక్కువ ధరకు విక్రయించడాన్ని ఆనాడు ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి. నిజాం షుగర్స్‌ను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ హయాంలో డిమాండ్లు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల చెరకు రైతులకు బకాయిలు చెల్లించడంలో సంస్థ యాజమాన్యం విఫలమవుతోంది. దీంతో రైతులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చక్కెర మిల్లుల్ని నడిపించాలని కోరాయి. తమ బకాయిలను కూడా చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతుల విజ్ఞప్తులను పరిశీలించిన కేసీఆర్ ప్రభుత్వం నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి విధి విధానాలను ఖరారు చేయాలని ఉత్తర్వులు జారీచేశారు.
Next Story