Telugu Global
NEWS

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పై 420 కేసు ?

     టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రభుత్వాన్ని మోసగించి పేద దళితులకు కేటాయించే స్థలాన్ని అక్రమంగా పొందారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్ల రామయ్య 1983లో విజయవాడలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసినప్పుడు పేద దళితుడినని చెప్పుకుని విద్యాధరపురం ఒకటో వార్డులో ఎన్టీపీఎస్ నెంబర్ 387/23పి, ఎల్.పి.నెంబర్ 14/83, ప్లాట్ నెంబర్ 20 నందు 253 చదరపు గజాలు స్థలాన్ని అక్రమంగా పొందారని దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సమాచార హక్కు […]

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పై 420 కేసు ?
X

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రభుత్వాన్ని మోసగించి పేద దళితులకు కేటాయించే స్థలాన్ని అక్రమంగా పొందారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్ల రామయ్య 1983లో విజయవాడలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసినప్పుడు పేద దళితుడినని చెప్పుకుని విద్యాధరపురం ఒకటో వార్డులో ఎన్టీపీఎస్ నెంబర్ 387/23పి, ఎల్.పి.నెంబర్ 14/83, ప్లాట్ నెంబర్ 20 నందు 253 చదరపు గజాలు స్థలాన్ని అక్రమంగా పొందారని దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సంబంధిత అధికారులు మాత్రం పేద దళితులకు కేటాయించే ఇంటి స్థలాన్ని 1983లో ఆయన పేరుతో పొందినట్లు ధ్రువీకరించారు. నిబంధనల ప్రకారం ఏ దళితుడికైనా కేవలం 90 చదరపు గజాలలోపు ఇళ్ల స్థలం కేటాయిస్తారని, రామయ్య తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని, దళితుడినని చెప్పుకుని ఇంటి స్థలం పొందారని, పక్కన ఉన్న పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి ఆలయం నిర్మించారని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తన కుమారుడి పేర ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆలయంలో వచ్చే ఆదాయాన్ని తన సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై దళిత, క్రైస్తవ సంఘాల రాష్ట్ర నాయకులు కోర్టులు కేసులు దాఖలు చేసినట్లు పేర్కొంటుండగా, దీనికి స్పందించిన కోర్టు ఈ నెల 13న విచారణ చేపట్టాలని భవానీపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ ను ఆదేశించినట్లు చెబుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 25న భవానీపురం పోలీసులు వర్ల రామయ్యపై ఎఫ్ఐఆర్ నెంబర్ 202/2015తో సెక్షన్ 405, 420 కింద కేసు నమోదు చేశారని వారంటున్నారు. ఈ కేసులో వర్ల రామయ్యను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు తారుమారు చేయించే అవకాశం ఉందంటున్నారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ ను కలిసి వర్ల రామయ్య అక్రమంగా స్థలం పొందడం పై వినతి పత్రం సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.

First Published:  30 April 2015 2:24 AM IST
Next Story