Telugu Global
Others

జీహెచ్‌ఎంసీ పరిధిలో పేదలకు 2 లక్షల ఇళ్లు

హైదరాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్‌ పరిధిలో పేదలకు రెండు లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు తెలిపారు. బహుళ అంతస్తుల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌లు నిర్మించి ఇస్తామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో గృహనిర్మాణ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఇళ్ల నిర్మాణానికి న‌గ‌ర ప‌రిధిలో రెండువేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కేటాయించిన భూములలో నిరుపయోగంగా ఉన్న వాటిని గుర్తించి వాటిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ తెలిపార‌ు. జీహెచ్‌ఎంసీ పరిధిలో […]

జీహెచ్‌ఎంసీ పరిధిలో పేదలకు 2 లక్షల ఇళ్లు
X

హైదరాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్‌ పరిధిలో పేదలకు రెండు లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు తెలిపారు. బహుళ అంతస్తుల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌లు నిర్మించి ఇస్తామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో గృహనిర్మాణ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఇళ్ల నిర్మాణానికి న‌గ‌ర ప‌రిధిలో రెండువేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కేటాయించిన భూములలో నిరుపయోగంగా ఉన్న వాటిని గుర్తించి వాటిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ తెలిపార‌ు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరిశుభ్రతపైనా ఈ సమావేశంలో కేసీఆర్‌ అధికారులతో చర్చించారు. వెయ్యి కోట్లతో భాగ్యనగరాన్ని క్లీన్‌ సిటీగా మారుస్తామన్నారు. ‘స్వచ్ఛ్‌ తెలంగాణ’, ‘స్వచ్ఛ్‌ హైదరాబాద్‌’ పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. మే 6 నుంచి స్వచ్ఛ్‌ హైదరాబాద్‌పై అవగాహన సమావేశాలు నిర్వహిస్తామ‌న్నారు. మే 16న ఈ కార్యక్రమాన్ని గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు బోథన్‌లోని నిజాం షుగర్‌ లిమిటెడ్‌ కంపెనీని స‌హ‌కార రంగంలో రైతులకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా దీన్ని సహకార శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

First Published:  30 April 2015 4:34 AM IST
Next Story