ఆర్.ఎస్.ఎస్.కి ఇంత ప్రచారం పిచ్చిదేనికి?
నేపాల్ భూకంపం నేపాల్, భారత ప్రజల్నేకాదు ప్రపంచవ్యాప్తంగా మానవత్వం ఉన్న ప్రతి మనిషినీ కదిలించింది. ఎక్కడ ఏ మంచి, చెడు జరిగినా దాని నుంచి ఎలా లాభ పడాలి, ఎలా ప్రచారం పొందాలి అని రాజకీయ పార్టీలు, రాజకీయనాయకులు ఆలోచిస్తారు. వాటిని తమకు అనుకూలంగా మల్చుకోవడానికి పడరాని పాట్లు పడతారు. రెండేళ్ళ క్రితం జరిగిన కేదార్‌నాథ్ విషాదం తర్వాత బాధితులకు […]
నేపాల్ భూకంపం నేపాల్, భారత ప్రజల్నేకాదు ప్రపంచవ్యాప్తంగా మానవత్వం ఉన్న ప్రతి మనిషినీ కదిలించింది. ఎక్కడ ఏ మంచి, చెడు జరిగినా దాని నుంచి ఎలా లాభ పడాలి, ఎలా ప్రచారం పొందాలి అని రాజకీయ పార్టీలు, రాజకీయనాయకులు ఆలోచిస్తారు. వాటిని తమకు అనుకూలంగా మల్చుకోవడానికి పడరాని పాట్లు పడతారు.
రెండేళ్ళ క్రితం జరిగిన కేదార్‌నాథ్ విషాదం తర్వాత బాధితులకు సాయం విషయంలో చంద్రబాబు, వి. హనుమంతరావుల తగాదాలు, మీడియాలో వాళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు చూసిన వాళ్ళకు ఎంత జుగుప్స కలిగించాయో ఇంకా ఎవరూ మర్చిపోలేదు.
నేపాల్ భూకంపం తర్వాత కొందరు ఆర్.ఎస్.ఎస్. వాళ్ళు కూడా ఇదే జాబితాలో చేరేలా ప్రవర్తిస్తున్నారు. కొందరు ఆర్.ఎస్.ఎస్. వీరాభిమానులు నిన్న సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగులు పెట్టారు. ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు నేపాల్ బాధితులకు సాయం చేస్తూ కష్టపడుతుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నీరో చక్రవర్తిలాగా మౌనంగా ఉండడాన్ని ఫోటోలతో పోస్ట్ చేశారు. ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తల సేవను మీడియా పట్టించుకోవడం లేదని వాపోయారు. అయితే నేపాల్ బాధితులకు ఆర్.ఎస్.ఎస్ వాళ్ళు సాయం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు కేదార్‌నాథ్ సంఘటన అప్పటివి. వాటిని ఇప్పుడు తెలివిగా వాడుకోవాలని దొరికిపోయారు. అలాగే గుజరాత్ భూకంపం అప్పుడు ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు సాయం చేస్తున్న ఫోటోలను ఇప్పుడు నేపాల్‌లో సాయం చేస్తున్నట్లుగా మీడియాకు అందించారు. సి.పి.ఎం. పార్టీ గుజరాత్ సంఘటన అప్పుడు పత్రికల్లో వచ్చిన ఫోటోలను, ఇప్పుడు నేపాల్ భూకంప బాధితులకు ఆర్.ఎస్.ఎస్ సాయం చేస్తున్నట్లుగా ఉన్న ఫోటోలను ప్రక్క ప్రక్క ప్రచురించింది. రెండూ ఒకటే. గుజరాత్‌లో తీసిన ఫోటోలనే ఇప్పుడు నేపాల్‌లో తీసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆర్.ఎస్.ఎస్‌కి ఇంత ప్రచారం పిచ్చి అవసరమా?
http://incidentstookplaceinindia.blogspot.in/2009/06/gujrat-earthquake.html