తెలంగాణలో రాహుల్ టూర్..
తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఇంకా తేదీలు ఖరారు కాకపోయినప్పటికీ మే రెండో వారంలో ఆయన పర్యటన తప్పక ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటించారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ దాన్ని క్యాష్ చేసుకోలేకపోయింది. కేసీఆర్ దెబ్బకు విలవిల్లాడుతోంది. నిస్తేజంగా మారిన కేడర్‌కు జవజీవాలు అందించడానికి రాహుల్ టానిక్ బాగా పనిచేస్తుందని తెలంగాణ నాయకులు సంబరపడుతున్నారు. పార్టీ అధ్యక్ష కిరీటం అలంకరించడానికి సిద్ధమవుతున్న రాహుల్ […]
BY admin30 April 2015 4:36 AM IST
X
admin Updated On: 30 April 2015 12:38 PM IST
తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఇంకా తేదీలు ఖరారు కాకపోయినప్పటికీ మే రెండో వారంలో ఆయన పర్యటన తప్పక ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటించారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ దాన్ని క్యాష్ చేసుకోలేకపోయింది. కేసీఆర్ దెబ్బకు విలవిల్లాడుతోంది. నిస్తేజంగా మారిన కేడర్‌కు జవజీవాలు అందించడానికి రాహుల్ టానిక్ బాగా పనిచేస్తుందని తెలంగాణ నాయకులు సంబరపడుతున్నారు. పార్టీ అధ్యక్ష కిరీటం అలంకరించడానికి సిద్ధమవుతున్న రాహుల్ తనను తాను నిరూపించుకోవడానికి దేశమంతా పర్యటించేందుకు ప్లాన్ వేసుకున్నారు. పంజాబ్ వెళ్లారు, మహారాష్ట్ర వెళుతున్నారు. తర్వాత తెలంగాణకు రాబోతున్నారు. దేశమంతా తిరిగి వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను ఆవరించిన ఓటమి భారాన్ని తగ్గించడానికి రాహుల్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రైతు సమస్యలపై ఆయన కేంద్రీకరిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించడం, మార్కెట్ యార్డులను పరిశీలించడం రాహుల్ ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు.
Next Story