నిప్పుల గుండంలో పడి పూజారి మృతి
అమ్మ ఆగ్రహించిందా… భక్త పూజారి తప్పటడుగు వేశాడా… ఏమో ఏదైతేనేం… నిప్పుల గుండం తొక్కుతున్న ఓ భక్తుడు ఆ నిప్పుల్లోనే పడి తనువు చాలించాడు. కర్ణాటకలోని సాత్నూరు కాళికాంబ దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఘటన ఇది. కాళికాంబ ఆలయంలో యేటా మాదిరిగానే జాతర జరుగుతోంది. జాతరలో నిప్పుల గుండం ఏర్పాటు చేయడం ఆనవాయితీ. బాజాలు, భజంత్రీలూ మోగుతున్నాయి… డప్పుల చప్పుడు భక్తుల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. సాటి భక్తుల చప్పట్లు భక్తులను ప్రేరేపిస్తున్నాయి. ఎంతోమంది భక్తులు నిప్పుల గుండంలోకి […]
BY admin30 April 2015 10:12 AM IST
X
admin Updated On: 30 April 2015 11:24 AM IST
అమ్మ ఆగ్రహించిందా… భక్త పూజారి తప్పటడుగు వేశాడా… ఏమో ఏదైతేనేం… నిప్పుల గుండం తొక్కుతున్న ఓ భక్తుడు ఆ నిప్పుల్లోనే పడి తనువు చాలించాడు. కర్ణాటకలోని సాత్నూరు కాళికాంబ దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఘటన ఇది. కాళికాంబ ఆలయంలో యేటా మాదిరిగానే జాతర జరుగుతోంది. జాతరలో నిప్పుల గుండం ఏర్పాటు చేయడం ఆనవాయితీ. బాజాలు, భజంత్రీలూ మోగుతున్నాయి… డప్పుల చప్పుడు భక్తుల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. సాటి భక్తుల చప్పట్లు భక్తులను ప్రేరేపిస్తున్నాయి. ఎంతోమంది భక్తులు నిప్పుల గుండంలోకి వెళ్ళి నడుస్తున్నారు. అందరు భక్తుల మాదిరిగానే ఆలయ పూజారి బసవన్న నిప్పుల గుండంలోకి ప్రవేశించాడు. ఒక పది అడుగులు వేసిన తర్వాత కాలు జారింది. అంతే అకస్మాత్తుగా నిప్పుల గుండంలో పడిపోయాడు. అలా పడిన పూజారి మళ్ళీ లేవలేకపోయాడు. మామూలుగా అయితే నిప్పుల గుండం ఐదారు అడుగుల పొడవుతో భూమికి అటుఇటుగా సమాంతరంగా ఉంటుంది. కానీ కాళికాంబ ఆలయంలో వేసిన గుండం పది అడుగులకు పైగా పొడవు… పైగా లోతుగా గొయ్యి తీసి నిప్పులు ఏర్పాటు చేశారు. అందులో నడవడానికి ప్రయత్నించిన పూజారి ఓ పది అడుగులు వేసిన తర్వాత కాలు జారిపోయింది. అంతే ఉన్నట్టుండి పడిపోయాడు. అతన్ని లేపడానికి ప్రయత్నించిన భక్తులకు నిప్పుల సెగ తగలడంతో కొంత వెనుకంజ వేశారు. క్షణాల్లోనే అతను నిప్పుల బారిన పడి తీవ్ర గాయాల పాలైపోయాడు. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కాలిన గాయాలతో కన్నుమూశాడు.
Next Story