నల్లగొండ థర్మల్ స్టేషన్‌కు..యాదాద్రి పేరు
హైదరాబాద్ : నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మించే అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘యాదాద్రి థర్మల్ స్టేషన్’ అనే పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. త్వరలోనే పవర్ స్టేషన్‌కు శంఖుస్థాపన చేస్తానని చెప్పారు. పగటి పూట 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ పరిస్థితి, భవిష్యత్ డిమాండ్ – సరఫరా, నల్గొండ జిల్లాలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంటు తదితర అంశాలపై […]
హైదరాబాద్ : నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మించే అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘యాదాద్రి థర్మల్ స్టేషన్’ అనే పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. త్వరలోనే పవర్ స్టేషన్‌కు శంఖుస్థాపన చేస్తానని చెప్పారు. పగటి పూట 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ పరిస్థితి, భవిష్యత్ డిమాండ్ – సరఫరా, నల్గొండ జిల్లాలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంటు తదితర అంశాలపై క్యాంపు కార్యాలయంలోముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులతో సమీక్షించారు. 2016 నాటికి విద్యుత్ కొరత లేని రాష్ట్రంగానూ, 2018 నాటికి మిగులు రాష్ట్రంగానూ తెలంగాణ మారుతుందని సీఎం కేసీఆర్ వివరించారు.