జర నవ్వండి ప్లీజ్ 69
టీచర్ – కృష్ణా! జరిగిపోయిన, ఇప్పుడు లేని సంగతి వచ్చేలా ఒక వాక్యం చెప్పు కృష్ణ – మీరు చాలా అందంగా ఉన్నారు టీచర్! —————————- ఒక అమ్మాయి బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్ డ్రా చేయాలనుకుంది మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేయగలరా? అన్నాడు క్లర్కు. ఆ అమ్మాయి తాపీగా హ్యాండ్ బ్యాగ్ అద్దంలో తల సర్దుకుని ఆ.. నేనే! నన్ను నేను గుర్తుపట్టాను అంది! —————————- రిపేరర్ – నేను మీ పియానో రిపేర్ చేయడానికి […]
BY Pragnadhar Reddy30 April 2015 12:45 AM IST
Pragnadhar Reddy Updated On: 30 April 2015 4:21 PM IST
టీచర్ – కృష్ణా! జరిగిపోయిన, ఇప్పుడు లేని సంగతి వచ్చేలా ఒక వాక్యం చెప్పు
కృష్ణ – మీరు చాలా అందంగా ఉన్నారు టీచర్!
—————————-
ఒక అమ్మాయి బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్ డ్రా చేయాలనుకుంది
మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేయగలరా? అన్నాడు క్లర్కు.
ఆ అమ్మాయి తాపీగా హ్యాండ్ బ్యాగ్ అద్దంలో తల సర్దుకుని
ఆ.. నేనే! నన్ను నేను గుర్తుపట్టాను అంది!
—————————-
రిపేరర్ – నేను మీ పియానో రిపేర్ చేయడానికి వచ్చాను.
ఆమె – మేము నిన్ను రమ్మన్లే లేదే!
రిపేరర్ – మీ పక్కింటి వాళ్లు పంపారు!
—————————-
తండ్రి – నీ వయసులో నా జుత్తు దట్టంగా కదుల్తూ అలల్ని గుర్తు చేసేది!
తండ్రి బట్ట తల చూసిన కొడుకు బహుశా అప్పుడే అవి టాటా చెప్పడం మొదలుపెట్టి వెళ్లిపోయాయేమో అన్నాడు.
Next Story