Telugu Global
National

దేశంలో వంద స్మార్ట్ న‌గ‌రాలు

దేశంలో వంద స్మార్ట్ న‌గ‌రాల‌ను అభివృద్ధి చేయ‌డానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మురో 500 న‌గ‌రాల‌ను అట‌ల్ మిష‌న్ ఫ‌ర్ రిజువెనేష‌న్ ప‌థ‌కం కింద అభివృద్ది చేస్తారు. వంద న‌గ‌రాల‌కు ఏటా వంద కోట్ల చొప్పున ఐదేళ్ళ పాటు ఇస్తారు. అట‌ల్ ప‌థ‌కం ల‌క్ష పైబ‌డిన జ‌నాభా గ‌ల ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కు మూడు విడ‌త‌లుగా కేంద్ర సాయం అందుతుంది. రెండు ప‌థ‌కాల‌కు క‌లిపి ఏటా ల‌క్ష కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తారు. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న […]

దేశంలో వంద స్మార్ట్ న‌గ‌రాలు
X
దేశంలో వంద స్మార్ట్ న‌గ‌రాల‌ను అభివృద్ధి చేయ‌డానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మురో 500 న‌గ‌రాల‌ను అట‌ల్ మిష‌న్ ఫ‌ర్ రిజువెనేష‌న్ ప‌థ‌కం కింద అభివృద్ది చేస్తారు. వంద న‌గ‌రాల‌కు ఏటా వంద కోట్ల చొప్పున ఐదేళ్ళ పాటు ఇస్తారు. అట‌ల్ ప‌థ‌కం ల‌క్ష పైబ‌డిన జ‌నాభా గ‌ల ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కు మూడు విడ‌త‌లుగా కేంద్ర సాయం అందుతుంది. రెండు ప‌థ‌కాల‌కు క‌లిపి ఏటా ల‌క్ష కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తారు. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ నేష‌న‌ల్ అర్బ‌న్ రెన్యువ‌ల్ మిష‌న్ ప‌థ‌కం స్థానంలో అట‌ల్ మిష‌న్ రాబోతోంది. కాంగ్రెస్ వాస‌న‌ల‌న్నీ పోగొట్టి కాషాయ రంగు పుల‌మ‌డానికి జాతీయంగా జ‌ర‌గుతున్న క‌స‌ర‌త్తులో భాగంగానే అట‌ల్ అర్బ‌న్ మిష‌న్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ప్ర‌భుత్వ‌-ప్ర‌యివేటు భాగ‌స్వామ్యం కింద ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌ను స్మార్ట్‌గా రూపొందిస్తారు.
First Published:  30 April 2015 6:34 AM IST
Next Story