సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న కమల్
కమల్ హాసన్ సినిమాలకు డబ్బింగ్ అంటే ఎస్పీ బాలసుబ్రమణ్యం చెప్పాల్సిందే. అంతలా వీళ్లిద్దరి బంధం అల్లుకుపోయింది. ఒకప్పుడు రాజశేఖర్ కు సాయికుమార్ డబ్బింగ్ చెప్పినట్టు.. కమల్ హాసన్ కు బాలు వాయిస్ కరెక్ట్ గా సూటవుతుంది. తర్వాత కొన్ని సినిమాలకు మనో కూడా డబ్బింగ్ చెప్పారు. అది కూడా బాగానే సూటయింది. అయితే తాజాగా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు లోకనాయకుడు. తెలుగులో తనే ఎందుకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోకూడదు అనే ఆలోచన వచ్చిన వెంటనే.. ఉత్తమ్ […]
BY admin29 April 2015 12:15 AM GMT
X
admin Updated On: 29 April 2015 12:15 AM GMT
కమల్ హాసన్ సినిమాలకు డబ్బింగ్ అంటే ఎస్పీ బాలసుబ్రమణ్యం చెప్పాల్సిందే. అంతలా వీళ్లిద్దరి బంధం అల్లుకుపోయింది. ఒకప్పుడు రాజశేఖర్ కు సాయికుమార్ డబ్బింగ్ చెప్పినట్టు.. కమల్ హాసన్ కు బాలు వాయిస్ కరెక్ట్ గా సూటవుతుంది. తర్వాత కొన్ని సినిమాలకు మనో కూడా డబ్బింగ్ చెప్పారు. అది కూడా బాగానే సూటయింది. అయితే తాజాగా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు లోకనాయకుడు. తెలుగులో తనే ఎందుకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోకూడదు అనే ఆలోచన వచ్చిన వెంటనే.. ఉత్తమ్ విలన్ సినిమా కోసం డబ్బింగ్ థియేటర్ లోకి అడుగుపెట్టారు కమల్. ఉత్తమ్ విలన్ సినిమాకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. మొదటిసారి కుదరకపోతే రెండోసారి కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పి ఓకే చేయించుకున్నారు. సో.. ఈసారి తెలుగువెర్షన్ లో నిజమైన కమల్ గొంతు వినొచ్చన్నమాట. మే డే కానుకగా మే 1న విడుదలకాబోతున్న ఉత్తమ్ విలన్ సినిమాకు మరో నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించాడు. పూజా కుమార్, ఆండ్రియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కమల్ ఆస్థాన సంగీత దర్శకుడు గిబ్రాన్ స్వరాలు సమకూర్చాడు.
Next Story