మే 14 నుంచి ఆర్టీసీ వేరుకుంపటి
హైదరాబాద్ : ఏపీఎస్ ఆర్టీసీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) విభజన పూర్తయింది. ఉమ్మడి రాష్ర్టానికి సంబంధించి ఆర్టీసీ ప్రస్థానం ఇక ముగియనుంది. సంస్థ విభజన ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ మే 14 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీగా విడిపోనుంది. కార్మికుల విభజనకు 2014 జూన్ 1 నాటికి ఉన్న సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకున్నారు. అధికారులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఈ నెల 10న ఉత్తర్వులు జారీ అయ్యాయి. బస్ […]
BY Pragnadhar Reddy29 April 2015 2:29 AM IST
X
Pragnadhar Reddy Updated On: 29 April 2015 10:14 AM IST
హైదరాబాద్ : ఏపీఎస్ ఆర్టీసీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) విభజన పూర్తయింది. ఉమ్మడి రాష్ర్టానికి సంబంధించి ఆర్టీసీ ప్రస్థానం ఇక ముగియనుంది. సంస్థ విభజన ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ మే 14 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీగా విడిపోనుంది. కార్మికుల విభజనకు 2014 జూన్ 1 నాటికి ఉన్న సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకున్నారు. అధికారులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఈ నెల 10న ఉత్తర్వులు జారీ అయ్యాయి. బస్ భవన్‌లోని ఏ బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్‌కు, బీ బ్లాక్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ఏపీఎస్ ఆర్టీసీ ఈడీలుగా జి. జయరావు, ఏవీ రావు, కోటేశ్వరరావు, భువనేశ్వర్ ప్రసాద్, రామక్రిష్ణ, ఎన్. వెంకటేశ్వరరావులను కేటాయించారు. తెలంగాణ ఆర్టీసీకి ఎం. రవీందర్, పురుషోత్తం నాయక్, నాగరాజును కేటాయించారు. తెలంగాణకు 22మంది, ఏపీకి 18మంది హెచ్‌ఓడీలను కేటాయించారు. అంటే.. మే 14 నుంచి ఎవరి పరిపాలన వారు సాగించడానికి అధికారులు సిద్ధమయ్యారు. రెండు రాష్ట్రాలకు అధికారులు, సిబ్బంది పంపిణీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఆస్తుల పంపిణీ కూడా తుది దశకు చేరుకుంది. మరి కొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి. ఇప్పటికే నష్టాల్లో కునారిల్లుతూ పడుతూ లేస్తూ నడుస్తున్నఆర్టీసీ మనుగడ ఈ రెండు రాష్ట్రాలకు విస్తరించిన తర్వాత ఎలా పయనిస్తుందన్న ప్రశ్నలు ఇపుడు అందరి మదినీ తొలుస్తున్నాయి.
Next Story