ఆధ్యాత్మిక వేత్తలకు స్థానంలేని టిటిడి బోర్డు...
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం, కోట్లాది ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వరుడి దేవస్థానానికి పాలక మండలి ఏర్పాటు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. టీటీడీ బోర్ట్ అంటే అందులో ఆధ్యాత్మిక వేత్తలు ఉంటారని అనుకోవడం సహజం. కాని తిరుమల బోర్డ్ ఎప్పడూ రాజకీయ నాయకులతోనే నిండిపోతుంది. చంద్రబాబు కూడా అందుకు అతీతుడేమీ కాదు. అందుకే తన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని ఛైర్మన్‌గాను, మరో ఐదుగురు తన పార్టీ ఎమ్మెల్యేలను సభ్యులుగాను […]
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం, కోట్లాది ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వరుడి దేవస్థానానికి పాలక మండలి ఏర్పాటు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. టీటీడీ బోర్ట్ అంటే అందులో ఆధ్యాత్మిక వేత్తలు ఉంటారని అనుకోవడం సహజం. కాని తిరుమల బోర్డ్ ఎప్పడూ రాజకీయ నాయకులతోనే నిండిపోతుంది. చంద్రబాబు కూడా అందుకు అతీతుడేమీ కాదు. అందుకే తన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని ఛైర్మన్‌గాను, మరో ఐదుగురు తన పార్టీ ఎమ్మెల్యేలను సభ్యులుగాను నియమించుకున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఒకరిని సభ్యుడిగా నియమిస్తారని ప్రచారం జరిగినా ఆ కోటా కర్నాటకకు మళ్ళిపోయింది. తమిళనాడుకు చెందిన ఎండీఎంకే అధ్యక్షుడు యలమంచిలి గోపాలస్వామి(వైగో) సిఫార్సుతో ఒక తమిళ నేతకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు చైనా పర్యటనకు వెళ్ళే ముందే టీటీడీ బోర్ట్ ఏర్పాటు పూర్తయిందని…కొద్ది సేపట్లో ప్రకటన వస్తుందని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ కేంద్ర నాయకుల ఒత్తడితో కొన్ని పేర్లు చేర్చడానికి వాయిదా పడిందన్నారు. తీరా ఏపీ, తెలంగాణకు చెందిన బీజేపీ నేతల పేర్లు తాజా జాబితాలో కనిపించలేదు. కేవలం కర్నాటకకు చెందిన ఒక బీజేపీ నేతకే చోటు లభించింది. మొత్తానికి తిరుమల వెంకటేశ్వరుడి రాజకీయ పాలకమండలి నియామకం ఎట్టకేలకు పూర్తయింది.