త్రిష కి ఆ పిచ్చి ఎక్కువే..!
ఒక హిరోయిన్ కి పెళ్లి అన్న మాట వినపడగానే సామాజిక సైట్స్ లలో ఏవేవో వార్తలు రాసేస్తుంటారు. అవి నిజమా, కావా అని తెలుసుకోవాలి అంటే ఆ హిరోయిన్ వచ్చి ఎదో ఒక వివరణ ఇస్తే గాని ఒక స్పష్టత రాదు అభిమానులకి. ఒక వేల ఈ విషయం ఒక రూమర్ అయితే సదరు హీరోయిన్ కి అది ఒక పెద్ద తలనొప్పి విషయమే. అందుకే ఇలాంటి విషయాల పైన హీరోయిన్స్ కొంచం ఫాస్ట్ గానే రియాక్ట్ […]
BY admin28 April 2015 3:30 PM IST
X
admin Updated On: 30 July 2015 11:56 AM IST
ఒక హిరోయిన్ కి పెళ్లి అన్న మాట వినపడగానే సామాజిక సైట్స్ లలో ఏవేవో వార్తలు రాసేస్తుంటారు. అవి నిజమా, కావా అని తెలుసుకోవాలి అంటే ఆ హిరోయిన్ వచ్చి ఎదో ఒక వివరణ ఇస్తే గాని ఒక స్పష్టత రాదు అభిమానులకి. ఒక వేల ఈ విషయం ఒక రూమర్ అయితే సదరు హీరోయిన్ కి అది ఒక పెద్ద తలనొప్పి విషయమే. అందుకే ఇలాంటి విషయాల పైన హీరోయిన్స్ కొంచం ఫాస్ట్ గానే రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక ఎంగేజేమేంట్ చేసుకున్న తర్వాత పెళ్లి కి గ్యాప్ వస్తే గాసిప్ రాయుళ్లకు చేతి నిండా పనే అన్నట్లుగా ఉంటుంది.
ఇలాంటి అనుభవమే హీరోయిన్ త్రిష కి ఎదురు అయ్యింది ఇప్పుడు. ఇండస్ట్రీయలిస్ట్ వరుణ్ మణియణ్ తో పెళ్లి అని చెప్పి నిశ్చితార్థం చేసుకున్నవిషయం తెలిసిందే. ఎంగేజ్ మెంట్ అయిన తరువాత త్రిష మర్చి నెలలో మా పెళ్లి అని చెప్పేసింది. కాని ఇప్పుడు ఆ పెళ్లి గురించి ఎటువంటి విషయాలు బయటకి రానివ్వడం లేదు . మాములుగా తన సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూండే త్రిష ఈ విషయం పైన ఎందుకు మౌనంగా ఉందని గాసిప్ రాయుళ్లకు సందేహాం. ఇక ఈ పెళ్లి ఆగిపోయిందనే వార్త కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న మాట. కాని ఈ విషయం పైన ఇప్పటికీ త్రిష నోరు మెదపకుండా, సినిమాల పైన దృష్టి పెట్టింది. వరుస సినిమాలతో త్రిష ఇప్పుడు బిజీ అయిపొయింది. త్రిష పెళ్లి జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే తనే అప్ డేట్స్ ఇవ్వాలి . అప్పటి వరకు ఇలా గాసిప్స్ హల్ చల్ చేస్తూనే వుంటాయంటున్నారు ఆమే అభిమానులు సైతం.
Next Story