జర నవ్వండి ప్లీజ్ 67
కస్టమర్ – ఏంటయ్యా ఇది ఆ వాసనేమిటి? ఇది టీయా కాఫీయా? వెయిటర్ – ఏంటి సార్? మీరేమంటున్నారు? కస్టమర్ – ఇది పెట్రోలు వాసన, వస్తోందయ్యా! అందుకే ఇది కాఫీయా టీయా అని అడిగాను వెయిటర్ – లేదు సార్ ఇది కాఫీయే. ఎందుకంటే మా హోటల్లో పెట్రోల్ వాసన వస్తే కాఫీ. ఇంజనాయిల్ వాసన వస్తే టీ. ————————- డాక్టర్ – బాబూ ! అయామ్ సారీ! నీకు రాబీస్ వచ్చింది. ఒక గంటలో […]
BY Pragnadhar Reddy28 April 2015 12:50 AM IST
Pragnadhar Reddy Updated On: 27 April 2015 9:54 AM IST
కస్టమర్ – ఏంటయ్యా ఇది ఆ వాసనేమిటి? ఇది టీయా కాఫీయా?
వెయిటర్ – ఏంటి సార్? మీరేమంటున్నారు?
కస్టమర్ – ఇది పెట్రోలు వాసన, వస్తోందయ్యా! అందుకే ఇది కాఫీయా టీయా అని అడిగాను
వెయిటర్ – లేదు సార్ ఇది కాఫీయే. ఎందుకంటే మా హోటల్లో పెట్రోల్ వాసన వస్తే కాఫీ. ఇంజనాయిల్ వాసన వస్తే టీ.
————————-
డాక్టర్ – బాబూ ! అయామ్ సారీ! నీకు రాబీస్ వచ్చింది. ఒక గంటలో నీకు పిచ్చెక్కే అవకాశముంది.
పేషెంట్ – డాక్టర్‌గారూ ! కాస్త పెన్ను, పేపరు ఇవ్వండి
డాక్టర్ – ఎందుకు? వీలునామా రాయాలనుకుంటున్నావా?
పేషెంట్ – లేదు డాక్టర్! ఎవరెవర్ని కరవాలో లిస్టు తయారు చేద్దామని.
————————
‘అరే! ఎందుకలా పైకీ కిందకీ ఎగిరిదూకుతున్నావు?’
‘ఇప్పుడే ఒక స్పూన్ టానిక్ తాగాను. తాగే ముందు బాటిల్ కదిలించి తాగమన్నాడు డాక్టర్. మరచిపోయాను. అందుకే ఎగురుతున్నాను’
———————–
స్ర్పింగ్ డోర్ నించి బయటికి వెళుతూ మళ్లీ లోపలికి వస్తూ అట్లా లోపలికి, బయటికి వస్తున్న మతిమరుపు ప్రొఫెసర్‌ని స్నేహితుడు అడిగాడు.
‘ఏమైంది? ఏమిటి సంగతి?’
‘నేను బయటికి వెళుతున్నానో, లోపలికి వస్తున్నానో మరిచిపోయాను’ అన్నాడు ప్రొఫెసర్
…
Next Story