హైకోర్టు ఆధీనంలో శేషాచలం దర్యాప్తు బృందం
శేషాచలం ఎన్‌కౌంటర్ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సమర్పించిన కేసు డైరీపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఈ కేసును తామే పర్యవేక్షిస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం (సిట్) ను తమ అధీనంలోకి తీసుకుంటున్నామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వేగంగా ఈ దర్యాప్తును పూర్తి చేయాలని సిట్‌ను […]
BY Pragnadhar Reddy27 April 2015 7:50 PM IST
Pragnadhar Reddy Updated On: 28 April 2015 9:39 AM IST
శేషాచలం ఎన్‌కౌంటర్ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సమర్పించిన కేసు డైరీపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఈ కేసును తామే పర్యవేక్షిస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం (సిట్) ను తమ అధీనంలోకి తీసుకుంటున్నామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వేగంగా ఈ దర్యాప్తును పూర్తి చేయాలని సిట్‌ను ఆదేశిస్తూ 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది. దర్యాప్తు తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని తెలిపింది.
Next Story