Telugu Global
Others

ప్ర‌త్యేక హోదా వ‌చ్చేవ‌ర‌కు ఆగ‌దు కాంగ్రెస్ పోరు: ఏపీసీసీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేన‌ని ఏపీ కాంగ్రెస్ క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. విభ‌జ‌న వ‌ల్ల ఎంతో న‌ష్ట‌పోయిన రాష్ట్రాన్ని అనాధ‌లా వ‌దిలేయ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించింది. విజ‌య‌వాడ‌లో స‌మావేశ‌మైన ఏపీసీసీ ముఖ్య నాయ‌కులు ప్ర‌త్యేక హోదాపై సుదీర్ఘ చ‌ర్చ జ‌రిపారు. ప్ర‌త్యేక హోదా ల‌భించేవ‌ర‌కు త‌మ పార్టీ పోరాటం జ‌రుపుతుంద‌ని, ఇందులో భాగంగానే వ‌చ్చేనెల రెండో తేదీన విజ‌య‌వాడ‌లో సామూహిక దీక్ష‌ల‌కు దిగుతామ‌ని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. ర‌ఘువీరారెడ్డి తెలిపారు. కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌నే ఏపీకి ప్ర‌త్యేక […]

raghuveera reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేన‌ని ఏపీ కాంగ్రెస్ క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. విభ‌జ‌న వ‌ల్ల ఎంతో న‌ష్ట‌పోయిన రాష్ట్రాన్ని అనాధ‌లా వ‌దిలేయ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించింది. విజ‌య‌వాడ‌లో స‌మావేశ‌మైన ఏపీసీసీ ముఖ్య నాయ‌కులు ప్ర‌త్యేక హోదాపై సుదీర్ఘ చ‌ర్చ జ‌రిపారు. ప్ర‌త్యేక హోదా ల‌భించేవ‌ర‌కు త‌మ పార్టీ పోరాటం జ‌రుపుతుంద‌ని, ఇందులో భాగంగానే వ‌చ్చేనెల రెండో తేదీన విజ‌య‌వాడ‌లో సామూహిక దీక్ష‌ల‌కు దిగుతామ‌ని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. ర‌ఘువీరారెడ్డి తెలిపారు. కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌నే ఏపీకి ప్ర‌త్యేక హోదా హ‌క్క‌ని అంటే తెలుగుదేశం ప్ర‌భుత్వంతోపాటు రాష్ట్ర ప‌రిపాల‌న‌లో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీ కూడా దీనిపై మొస‌లి క‌న్నీరు కారుస్తూ జనాన్ని మోసం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. జ‌గ‌న్ కూడా కేసుల భ‌యం వ‌ల్లే ప్ర‌త్యేక హోదాపై మాట్లాడ‌డం లేద‌ని మ‌రో నాయ‌కుడు ఆనం వివేకానంద‌రెడ్డి ఆరోపించారు. ప్ర‌త్యేక హోదా కోసం చంద్ర‌బాబు మ‌న‌సు పెట్టి ప‌ని చేయ‌క‌పోతే పోయిన ఎన్నిక‌ల్లో త‌మ‌కు ప‌ట్టిన గ‌తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి ప‌డుతుంద‌ని ఆయ‌న‌ అన్నారు. ప్ర‌ధాని మోడీకి చిత్త‌శుద్ధి ఉంటే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల‌ని డిమాండు చేశారు. ప్ర‌త్యేక హోదా ల‌భించేవ‌ర‌కు ఏపీలో పార్టీ ద‌శ‌ల‌వారీగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంద‌ని తెలిపారు.
First Published:  27 April 2015 5:15 PM GMT
Next Story