Telugu Global
Health & Life Style

వేసవి అల్పాహారం..!

కాలాన్ని బట్టి మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యం మన వెన్నంటి ఉంటుంది. వేసవి కాలంలో మన అల్పాహారంలో మార్పులు అవసరమే అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే వేసవిలో ఆకలి ఎక్కువగా వేస్తుందట. ఉదయం పూట ఆరోగ్యానికి మేలుచేసే అల్పాహారాన్ని మెండుగా తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.  – వేసవిలో గోధుమలతో చేసిన పదార్థాలు అల్పాహారంగా మేలంటున్నారు. గోధుమలో విటమిన్ ఇ, ఫొలేట్ అధికంగా ఉంటాయి. వాటివల్ల హెమోగ్లోబిన్ శాతం వృద్ధి చెందుతుంది. శరీరానికి ఎక్కువ శక్తి […]

వేసవి అల్పాహారం..!
X
కాలాన్ని బట్టి మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యం మన వెన్నంటి ఉంటుంది. వేసవి కాలంలో మన అల్పాహారంలో మార్పులు అవసరమే అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే వేసవిలో ఆకలి ఎక్కువగా వేస్తుందట. ఉదయం పూట ఆరోగ్యానికి మేలుచేసే అల్పాహారాన్ని మెండుగా తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
– వేసవిలో గోధుమలతో చేసిన పదార్థాలు అల్పాహారంగా మేలంటున్నారు. గోధుమలో విటమిన్ ఇ, ఫొలేట్ అధికంగా ఉంటాయి. వాటివల్ల హెమోగ్లోబిన్ శాతం వృద్ధి చెందుతుంది. శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. త్వరగా అలసి పోకుండా ఉంటారు.
– వేసవిలో ఉదయం పూట ఉడికించిన గుడ్డు తినడం కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తగినంత శక్తి లభిస్తుంది.
– కాల్షియం ఎక్కువగా ఉంటుంది కనుక పెరుగు తినడం కూడా మన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఎండలో వెంటనే అలసి పోకుండా కాపాడుతుంది.
– ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం వల్ల అందులోని పోషకాలు మన శరీరంలోని వ్యర్థాలను బైటకు పంపించేస్తాయి.
– అరటిపండులో సహజ చక్కెర, పొటాషియం, పీచు, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. అందువల్ల ఉదయాన్నే అరటిపండు, గ్లాసు పాలు తీసుకున్నా మద్యాహ్నం వరకు ఆకలి వేయకుండా ఉత్సాహంగా ఉంచుతాయి.
First Published:  26 April 2015 9:51 PM GMT
Next Story