విజయ్ మాల్యా మీ సేవలు చాలు... ఇంటికెళ్ళండి
న్యూఢిల్లీ: యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్, డైరెక్టర్ పదవుల నుంచి వైదొలగమని కంపెనీ కొత్త యాజమాన్య సంస్థ డియాజియో.. విజయ్‌మాల్యాను ఆదేశించింది. కంపెనీ నిధులను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సహా ఇతర యుబి గ్రూప్ కంపెనీలకు మళ్లించాడన్న ఆరోపణలపై విచారణ జరిపించిన డియాజియో ఈమేరకు డిమాండ్ చేసినట్లు తెలిసింది. లావాదేవీల అవకతవకలకు మాల్యాకు సంబంధం ఉందని, అందువల్ల ఆయన బోర్డు నుంచి వైదొలగాలని బోర్డు డైరెక్టర్లు తీర్మానించారని డియాజియో తెలిపింది. అయితే ఈ ఆదేశాన్ని తిరస్కరించిన మాల్యా… ఈ విచారణ […]
BY Pragnadhar Reddy26 April 2015 8:32 PM IST
Pragnadhar Reddy Updated On: 29 April 2015 6:40 AM IST
న్యూఢిల్లీ: యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్, డైరెక్టర్ పదవుల నుంచి వైదొలగమని కంపెనీ కొత్త యాజమాన్య సంస్థ డియాజియో.. విజయ్‌మాల్యాను ఆదేశించింది. కంపెనీ నిధులను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సహా ఇతర యుబి గ్రూప్ కంపెనీలకు మళ్లించాడన్న ఆరోపణలపై విచారణ జరిపించిన డియాజియో ఈమేరకు డిమాండ్ చేసినట్లు తెలిసింది. లావాదేవీల అవకతవకలకు మాల్యాకు సంబంధం ఉందని, అందువల్ల ఆయన బోర్డు నుంచి వైదొలగాలని బోర్డు డైరెక్టర్లు తీర్మానించారని డియాజియో తెలిపింది. అయితే ఈ ఆదేశాన్ని తిరస్కరించిన మాల్యా… ఈ విచారణ నివేదిక తప్పుల తడక అని అరోపించారు. యుబి గ్రూప్ నుంచి యునైటెడ్ స్పిరిట్స్‌లో మెజార్టీ వాటాలను డియాజియో కొనుగోలు చేసింది. ఏప్రిల్ 25న జరిగిన సమావేశంలో ఎండి, సిఇఒ ఇచ్చిన సమాధానంపై విస్తృత చర్చ జరిగినట్లు తెలిసింది. పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాల్యాను సిఇఒ, డైరెక్టర్ హోదాల నుంచి తొలగించాలని బోర్డు షేర్ హోల్డర్లకు సిఫార్సు చేసినట్లు పేర్కొంది. దీనితోపాటు దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించిన బోర్డు ఈ అంశంలో పూర్తి అధికారాలను కంపెనీకి కట్టబెట్టిందని డియాజియో వెల్లడించింది. బోర్డు డైరెక్టర్లు మాల్యాపై విశ్వాసం కోల్పోయారని, పదవినుంచి దిగిపొమ్మని తీర్మానం చేశారని తెలిపింది.
Next Story