ఏపి అప్పులపై ఆంక్షలు...
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు చేసే విషయంలో కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి లక్ష కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌కు ద్రవ్యలోటు కూడా 18 వేల కోట్లకు మించి ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్రంలో వసూలయ్యే పన్నులు, ఖర్చులు, కేంద్ర పథకాలు అన్నింటిని అంచనా వేసిన తర్వాత ఏపీ అప్పుల పరిమితిని ఈ ఏడాదికి 18 వేల కోట్లకు పరిమితం చేసినట్లు స్వయంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. […]
BY Pragnadhar Reddy27 April 2015 5:40 AM IST
X
Pragnadhar Reddy Updated On: 27 April 2015 9:43 AM IST
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు చేసే విషయంలో కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి లక్ష కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌కు ద్రవ్యలోటు కూడా 18 వేల కోట్లకు మించి ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్రంలో వసూలయ్యే పన్నులు, ఖర్చులు, కేంద్ర పథకాలు అన్నింటిని అంచనా వేసిన తర్వాత ఏపీ అప్పుల పరిమితిని ఈ ఏడాదికి 18 వేల కోట్లకు పరిమితం చేసినట్లు స్వయంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం రాష్ట్రం ఈ పరిమితికి లోబడే అప్పలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే అప్పలు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే అప్పులు, ఇతర దేశాల నుంచి తెచ్చుకునే అప్పలు అన్నీ కలిపి 18 వేల కోట్లకు మించకూడదు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన తర్వాత వారి జీతాల బిల్లు ఏడాదికి 40 వేల కోట్లకు పైగానే అవుతుంది. రాష్ర్ట ముఖ్య ఆదాయవనరులైన కమర్షియల్ ట్యాక్స్, మద్యం అమ్మకాలపై వచ్చే ఎక్సైజ్ పన్నులు కలిపితే వచ్చే ఆదాయం 44 వేల కోట్లుగా అంచనా వేశారు. ఇక అభివృద్ధి, సంక్షేమ, విద్యుత్ సబ్సిడీ పథకాలకు నిధుల కోత తప్పేట్లు కనిపించడంలేదు. ఆదాయం జానెడు, ఖర్చు బారెడు, అప్పులకు పరిమితి విధించుకోవాల్సి రావడంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రానున్నది గడ్డు కాలమే అని చెప్పక తప్పదు. తనకున్న ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానంతో అన్ని సమస్యలను అధిగమిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అతి కీలకమైన ఆర్థిక సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
Next Story