ఇకపై తెలుగు ఫిలిం ఛాంబర్
ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్ ఫిలింఛాంబర్ గా చలామణిలో ఉన్నసంస్థ.. ఇకపై తెలుగు ఫిలింఛాంబర్ గా మారబోతోంది. దీనికి సంబంధించి సభ్యులంతా ఓ ఏకాభిప్రాయానికొచ్చారు. విజయవాడలో జరిగిన సర్వసభ్య సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇకపై తెలుగు ఫిలింఛాంబర్ గానే వ్యవహరించడానికి ఆమోదించారు. పనిలోపనిగా చాన్నాళ్లుగా నానుతూ వస్తున్న ఎలక్షన్ల ప్రక్రియను కూడా పూర్తిచేయాలని ఫిక్స్ చేశారు. జూన్ 28, ఆదివారం నాడు తెలుగు ఫిలింఛాంబర్ కు ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. మా ఎన్నికల్లా కాకుండా.. […]
BY admin27 April 2015 8:20 AM IST

X
admin Updated On: 27 April 2015 8:20 AM IST
ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్ ఫిలింఛాంబర్ గా చలామణిలో ఉన్నసంస్థ.. ఇకపై తెలుగు ఫిలింఛాంబర్ గా మారబోతోంది. దీనికి సంబంధించి సభ్యులంతా ఓ ఏకాభిప్రాయానికొచ్చారు. విజయవాడలో జరిగిన సర్వసభ్య సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇకపై తెలుగు ఫిలింఛాంబర్ గానే వ్యవహరించడానికి ఆమోదించారు. పనిలోపనిగా చాన్నాళ్లుగా నానుతూ వస్తున్న ఎలక్షన్ల ప్రక్రియను కూడా పూర్తిచేయాలని ఫిక్స్ చేశారు. జూన్ 28, ఆదివారం నాడు తెలుగు ఫిలింఛాంబర్ కు ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. మా ఎన్నికల్లా కాకుండా.. తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలు సజావుగా సాగాలని కోరుకుందాం.
Next Story