జర నవ్వండి ప్లీజ్ 65
డాక్టర్ – గుడ్‌మార్నింగ్ కృష్ణారావు గారు! ఏమిటి కనిపించి ఐదారు నెలలైంది? ఏమయ్యారు? కృష్ణారావు – ఆరోగ్యం బాగోలేక మీ దగ్గరకు రాలేదు డాక్టర్ గారు! ————————- తండ్రి – ఏ దేశంలో ప్రజలు ఎక్కువ అజ్ఞానం గలవాళ్లు! ఆరేళ్ల కొడుకు – జపాన్ ! టక్కుమని సమాధానం చెప్పాడు తండ్రి – ఎట్లా చెప్పగలుగుతున్నావు? కొడుకు – జనాభా ఎక్కువున్న చోట అజ్ఞానముంటుందని మా టీచర్ చెప్పింది. తండ్రి – ఎక్కవ జనసాంద్రత ఉన్న నగరం […]
BY Pragnadhar Reddy26 April 2015 12:45 AM IST
Pragnadhar Reddy Updated On: 26 April 2015 3:05 AM IST
డాక్టర్ – గుడ్‌మార్నింగ్ కృష్ణారావు గారు! ఏమిటి కనిపించి ఐదారు నెలలైంది? ఏమయ్యారు?
కృష్ణారావు – ఆరోగ్యం బాగోలేక మీ దగ్గరకు రాలేదు డాక్టర్ గారు!
————————-
తండ్రి – ఏ దేశంలో ప్రజలు ఎక్కువ అజ్ఞానం గలవాళ్లు!
ఆరేళ్ల కొడుకు – జపాన్ ! టక్కుమని సమాధానం చెప్పాడు
తండ్రి – ఎట్లా చెప్పగలుగుతున్నావు?
కొడుకు – జనాభా ఎక్కువున్న చోట అజ్ఞానముంటుందని మా టీచర్ చెప్పింది.
తండ్రి – ఎక్కవ జనసాంద్రత ఉన్న నగరం ట్యోక్యో కదా! అన్నాడు.
————————–
రాజేష్ ‘ ఒక పెంగ్విన్ పక్షిని తీసుకుని వచ్చి నాకిది దొరికింది. దీన్ని ఏం చేయాలి?’ అని అక్కడే ఉన్న ఒక పోలీస్‌ణు అడిగాడు.
‘జూకు తీసుకెళ్లు’ అన్నాడు పోలీసు
మళ్లీ మరుసటి రోజు రాజేష్ తన పెంగ్విన్ పక్షితోపాటు పోలీసుకు కనిపించాడు.
‘అరే నిన్న నువ్వు దాన్ని జూకు తీసుకెళ్లావేమో అనుకున్నాను’ అన్నాడు పోలీస్
‘అవును నిన్న జూకు తీసుకెళ్లాను ఈ రోజు సినిమాకు తీసుకెళుతున్నాను’ అన్నాడు రాజేష్.
Next Story