ప్రత్యేక హోదా ఏపీ హక్కు: నిర్మలాసీతారామన్
ఏపీ ప్రత్యేక హోదాకు కేంద్రం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. విభజన సమయంలో కేంద్రం ఏ హామీలయితే ఇచ్చిందో అవన్నీ మోడీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె అన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేని మాట వాస్తవమేనని అయితే ఇది ఆంధ్రప్రదేశ్‌కు వర్తించదని ఆమె అన్నారు. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సులలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫార్సు చేయని మాట వాస్తవమేనని అయితే అదొక్కటే కొలమానం కాదని ఆమె అన్నారు. కేంద్రం […]
ఏపీ ప్రత్యేక హోదాకు కేంద్రం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. విభజన సమయంలో కేంద్రం ఏ హామీలయితే ఇచ్చిందో అవన్నీ మోడీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె అన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేని మాట వాస్తవమేనని అయితే ఇది ఆంధ్రప్రదేశ్‌కు వర్తించదని ఆమె అన్నారు. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సులలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫార్సు చేయని మాట వాస్తవమేనని అయితే అదొక్కటే కొలమానం కాదని ఆమె అన్నారు. కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి అనేక విధాలుగా సాయం చేస్తూ వస్తుందని, అనేక పథకాలకు నిధులు ఇవ్వడం, పలు పథకాలను ప్రకటించడం చేసిందని ఆమె గుర్తు చేశారు. అయితే ఈ నిధులు ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏపీని అభివృద్ధి చేయాలన్నదే కాని ప్రత్యేక హోదా ఇవ్వకూడదని మాత్రం కాదని, ఈ విషయంలో మోడీ ఆలోచన చేస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్ రాకున్నా అధిక మొత్తంలో నిధులు కేటాయించామని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.2,203 కోట్లు, అసెంబ్లీ.. రాజ్‌భవన్ నిర్మాణానికి రూ.500 కోట్లు, రోడ్లు.. మౌలిక వసతుల కోసం రూ.1,803 కోట్లు కేటాయించినట్టు ఆమె స్పష్టం చేశారు. నాగార్జున వర్సిటీలో తాత్కాలికంగా ఎన్‌ఐడీ ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలో ఎన్‌ఐడీ శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు.