Telugu Global
Others

మ‌రుభూమిని త‌ల‌పిస్తున్న నేపాల్‌లో... మృతులు 3000!

  మ‌రుభూమిని త‌ల‌పిస్తున్న‌ట్టుంది నేపాల్‌… ఇప్ప‌టికి 2100 మంది శ‌వాల‌ను బ‌య‌టికి తీశారు. మ‌రో వెయ్యి వ‌ర‌కు శిథిలాల కింద ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. ఇంకా శిథిలాల కింద నుంచి మృత‌దేహాల‌ను తీస్తూనే ఉన్నారు. క్ష‌త‌గాత్రుల‌కు చికిత్స అందిస్తూనే ఉన్నారు. గుండెల‌ర‌చేతిలో పెట్టుకుని రాత్రంతా గ‌డిపారు జ‌నం. ఉద‌యం మ‌ళ్ళీ మ‌‌రోసారి భూమి కంపించింది. మ‌ధ్యాహ్నం 12.15 స‌మ‌యంలో వ‌చ్చిన ఈ ప్ర‌కంప‌న‌లు రిక్ట‌ర్ స్కేలుపై 7.2 గా న‌మోదైంది. జ‌నం భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. నేపాల్‌కు 80 కిలోమీట‌ర్ల […]

మ‌రుభూమిని త‌ల‌పిస్తున్న నేపాల్‌లో... మృతులు 3000!
X

మ‌రుభూమిని త‌ల‌పిస్తున్న‌ట్టుంది నేపాల్‌… ఇప్ప‌టికి 2100 మంది శ‌వాల‌ను బ‌య‌టికి తీశారు. మ‌రో వెయ్యి వ‌ర‌కు శిథిలాల కింద ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. ఇంకా శిథిలాల కింద నుంచి మృత‌దేహాల‌ను తీస్తూనే ఉన్నారు. క్ష‌త‌గాత్రుల‌కు చికిత్స అందిస్తూనే ఉన్నారు. గుండెల‌ర‌చేతిలో పెట్టుకుని రాత్రంతా గ‌డిపారు జ‌నం. ఉద‌యం మ‌ళ్ళీ మ‌‌రోసారి భూమి కంపించింది. మ‌ధ్యాహ్నం 12.15 స‌మ‌యంలో వ‌చ్చిన ఈ ప్ర‌కంప‌న‌లు రిక్ట‌ర్ స్కేలుపై 7.2 గా న‌మోదైంది. జ‌నం భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. నేపాల్‌కు 80 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్ర‌కంప‌న‌ల కేంద్రం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈ ప్ర‌కంప‌న‌ల వ‌ల్ల స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు తీవ్ర ఆటంకం క‌లుగుతుంది. ఈ ప్ర‌కంప‌న‌లు ఒక వారంపాటు వ‌స్తూనే ఉంటాయ‌ని వారంటున్నారు.

భార‌త్‌లో మృతులు 60
కాగా భార‌తదేశంలో కూడా ఆదివారం ప్ర‌కంప‌న‌లు అక్క‌డ‌క్క‌డా క‌నిపించాయి. బీహార్‌లో ఎక్కువ మంది మ‌ర‌ణించారు. మృతులు 47గా లెక్క తేలారు. ఆదివారం కూడా ఉత్త‌ర భార‌త‌దేశంలోని రాజ‌స్థాన్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్ రాష్ట్రాల్లో భూమి కంపించిన‌ట్టు చెబుతున్నారు. ఢిల్లీ, అల‌హాబాద్‌, లక్నో, భువ‌నేశ్వ‌ర్‌, గౌహ‌తి, పాట్నా, డెహ్రాడూన్‌, నోయిడా ప్రాంతాల్లో భూమి కంపించ‌డంతో జ‌నం ఇళ్ళ నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఈరోజు కూడా ఢిల్లీ, క‌ల‌క‌త్తాలో మెట్రో రైళ్ళ‌ను నిలిపి వేశారు. శ్రీ‌కాకుళం ఇందిరాన‌గ‌ర్‌లో స్వ‌ల్ప కంప‌న‌లు వ‌చ్చిన‌ట్టు మా ప్ర‌తినిధి చెప్పారు. ఈప్ర‌కంప‌న‌ల‌కు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఎన్‌.జిఆర్ఐ శాస్త్ర‌వేత చ‌ద్దా తెలిపారు. రెండుమూడు రోజులు ఇవి వ‌స్తుంటాయ‌ని ఆయ‌న అన్నారు. మ‌రో శాస్త్రవేత్త న‌గేశ్ మాట్లాడుతూ గ‌త 24 గంట‌ల్లో ఇప్పటివ‌ర‌కు 34 సార్లు కంపన‌లు వ‌చ్చాయని, ఇవి కొన్ని గుర్తించేట్టుగా ఉంటాయ‌ని, మ‌రికొన్ని ప్ర‌భావ‌శీలంగా ఉంటాయ‌ని తెలిపారు. గ‌త 24 గంట‌ల్లో వ‌చ్చిన ప్ర‌కంప‌న‌ల స్థాయి రిక్టెర్ స్కేలుపై 4 నుంచి 6.9 గా న‌మోదైంద‌ని ఆయ‌న తెలిపారు.
First Published:  26 April 2015 2:11 PM IST
Next Story