గంగిరెడ్డితో నటి నీతూ అగర్వాల్ సంబంధాలపై విచారణ..
కర్నూలు: మస్తాన్‌వలీ బ్లాక్ మెయిలింగ్ భరించలేకే తాను ఆయనకు అనుకూలంగా పని చేసినట్టు సినీ నటి నీతూ అగర్వాల్ చెప్పారు. తాను సినిమాలో నటించిన తర్వాత తనపనులు తాను చూసుకుంటుంటే మస్తాన్ తన దగ్గరకు వచ్చి రకరకాలుగా ప్రలోభపెట్టి దగ్గరయ్యాడని, అప్పటి నుంచి తాను ఎంత దూరం జరుగుదామని ప్రయత్నించినా కుదరకుండా చేశాడని ఆమె తెలిపింది. స్మగ్లర్ బాలునాయక్ అకౌంటక్‌కు రూ.లక్ష బదిలీ చేసినట్టు నటి నీతూ అగర్వాల్ పోలీసుల వద్ద అంగీకరించింది. నీతూని అరెస్టు చేసిన […]
BY Pragnadhar Reddy26 April 2015 1:42 PM IST
X
Pragnadhar Reddy Updated On: 27 April 2015 7:10 AM IST
కర్నూలు: మస్తాన్‌వలీ బ్లాక్ మెయిలింగ్ భరించలేకే తాను ఆయనకు అనుకూలంగా పని చేసినట్టు సినీ నటి నీతూ అగర్వాల్ చెప్పారు. తాను సినిమాలో నటించిన తర్వాత తనపనులు తాను చూసుకుంటుంటే మస్తాన్ తన దగ్గరకు వచ్చి రకరకాలుగా ప్రలోభపెట్టి దగ్గరయ్యాడని, అప్పటి నుంచి తాను ఎంత దూరం జరుగుదామని ప్రయత్నించినా కుదరకుండా చేశాడని ఆమె తెలిపింది. స్మగ్లర్ బాలునాయక్ అకౌంటక్‌కు రూ.లక్ష బదిలీ చేసినట్టు నటి నీతూ అగర్వాల్ పోలీసుల వద్ద అంగీకరించింది. నీతూని అరెస్టు చేసిన పోలీసులు ఆమె వద్ద నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఉపయోగించిన కారుని సీజ్ చేశారు. మస్తాన్‌వలీ, నీతూ అకౌంట్ల మధ్య భారీగా నగదు లావాదీవీలు జరిగినట్టు గుర్తించారు. ఎర్రచందనం స్మగ్లర్లు, గంగిరెడ్డితో నీతూకున్న సంబంధాలపైనా విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, నీతూని ఆళ్లగడ్డ కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నట్టు కర్నూలు ఎస్పీ తెలిపారు.
Next Story