ఖాట్మండులో తెలుగువారి జాడెక్కడ?
ఉత్తర, ఈశాన్య భారతంలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళిన దాదాపు 80 మంది తెలుగువారి జాడ తెలియకుండా పోయింది. ఇందులో 28 మంది హైదరాబాద్ వాసులుకాగా మరో 30 మంది గుంటూరు జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం వెటకారం సినిమా చిత్రీకరణ కోసం ఖాట్మండు వెళ్ళిన సిబ్బంది జాడ కూడా తెలియడం లేదు. ఈ బృందంలో 20 మంది సభ్యులున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 17న మల్కాజ్‌గిరి నుంచి సాయిబాబా ట్రావెల్స్ బస్సులో బయలుదేరిన హైదరాబాద్ వాసులు […]
BY Pragnadhar Reddy25 April 2015 9:56 AM IST
Pragnadhar Reddy Updated On: 25 April 2015 11:26 AM IST
ఉత్తర, ఈశాన్య భారతంలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళిన దాదాపు 80 మంది తెలుగువారి జాడ తెలియకుండా పోయింది. ఇందులో 28 మంది హైదరాబాద్ వాసులుకాగా మరో 30 మంది గుంటూరు జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం వెటకారం సినిమా చిత్రీకరణ కోసం ఖాట్మండు వెళ్ళిన సిబ్బంది జాడ కూడా తెలియడం లేదు. ఈ బృందంలో 20 మంది సభ్యులున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 17న మల్కాజ్‌గిరి నుంచి సాయిబాబా ట్రావెల్స్ బస్సులో బయలుదేరిన హైదరాబాద్ వాసులు శుక్రవారం ముక్తినాథ్‌ను సందర్శించుకుని శనివారం ఉదయం నేపాల్ రాజధాని ఖాట్మండుకు చేరుకున్నారు. శనివారం ఉదయం 11.41 నిమషంలో సంభవించించిన భూకపం వీరి జాడ తెలియకుండా చేసింది. ఈ యాత్రీకుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందినవారే. అసలు వీరు ఎక్కడున్నారు? వీరి పరిస్థితి ఏమిటి? అన్నది తెలియక బంధువులు తల్లడిల్లిపోతున్నారు. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అలాగే గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన వారు కూడా 30 మంది ఖాట్మండులో ఉన్నారని చెబుతున్నారు. వారి నుంచి కూడా బంధువులకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 20వ తేదీన ఇక్కడ నుంచి పశుపతినాథ్ దర్శనం కోసం వారు వెళ్ళినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అప్రమత్తమయ్యాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ ద్వారా పర్యాటకుల వివరాలు అందించడానికి ప్రయత్నిస్తున్నారు..
Next Story