హిజ్రాల హక్కుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
స్త్రీ, పురుషులు కాకుండా మూడో జెండర్‌గా జీవిస్తున్న హిజ్రాల హక్కలకు రక్షణ కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. డిఎంకె సభ్యుడు తిరుచి శివ ప్రతిపాదించిన ప్రయివేటు బిల్లుకు రాజ్యసభ లభించింది. భారత పార్లమెంట్ ఏర్పాటయ్యాక ఎగువ సభలో ఒక ప్రయివేటు సభ్యుడు ప్రతిపాదించిన బిల్లు ఆమోదం పొందడం ఇది 15వ సారి. 1970 తర్వాత ఇదే మొదటిసారి. డిఎంకే సభ్యుడు శివ ప్రతిపాదించిన ఈ బిల్లును ఉపసంహరింపచేయడానికి ప్రభుత్వం తీవ్రంగానే ప్రయత్నించింది. బిల్లులో చాలా లోపాలున్నాయని […]
BY Pragnadhar Reddy25 April 2015 12:10 AM GMT
X
Pragnadhar Reddy Updated On: 25 April 2015 12:10 AM GMT
స్త్రీ, పురుషులు కాకుండా మూడో జెండర్‌గా జీవిస్తున్న హిజ్రాల హక్కలకు రక్షణ కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. డిఎంకె సభ్యుడు తిరుచి శివ ప్రతిపాదించిన ప్రయివేటు బిల్లుకు రాజ్యసభ లభించింది. భారత పార్లమెంట్ ఏర్పాటయ్యాక ఎగువ సభలో ఒక ప్రయివేటు సభ్యుడు ప్రతిపాదించిన బిల్లు ఆమోదం పొందడం ఇది 15వ సారి. 1970 తర్వాత ఇదే మొదటిసారి. డిఎంకే సభ్యుడు శివ ప్రతిపాదించిన ఈ బిల్లును ఉపసంహరింపచేయడానికి ప్రభుత్వం తీవ్రంగానే ప్రయత్నించింది. బిల్లులో చాలా లోపాలున్నాయని ప్రభుత్వం అన్నీ సరిచేసి లోపాలు లేని బిల్లు తీసుకువచ్చి హిజ్రాలకు న్యాయం జరిగేవిధంగా చూస్తుందని మంత్రులు చెప్పినా డిఎంకే సభ్యుడు వినలేదు. ప్రతిపక్షం కూడా ఆయనకే మద్దతు తెలిపింది. రాజ్యసభలో ప్రతిపక్షానిదే మెజారిటీ కావడంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది. చివరికి తాను మద్దతిచ్చి బిల్లు పాసయ్యేందుకు సహకరించింది. ఈ బిల్లులోని లోపాలన్నీ సవరించి లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి అంగీకరించింది. ఈ బిల్లు వల్ల హిజ్రాలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. 2006 నుంచి ఐదేళ్ళ పాటు తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం హిజ్రాల హక్కులు కాపడే చట్టం తీసుకువచ్చింది. ఈ తరహా చట్టం దేశంలో అదే మొదటిది. ఇప్పడు దేశవ్యాప్తంగా హిజ్రాల హక్కులు కాపాడేందుకు కూడా డిఎంకే సభ్యుడే చొరవ తీసుకుని విజయం సాదించారు.
Next Story