హత్య చేసిన మైనర్‌కు పాక్‌లో ఉరిశిక్ష
పదకొండు సంవత్సరాల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఏడేళ్ళ బాలుడిని హత్య చేసిన వ్యక్తికి మే 6న ఉరి శిక్ష విధించబోతున్నారు. అయితే హత్య చేసిన నాటికి షాకత్ అనే వ్యక్తి మైనర్ అనే ఆలోచనతో ఉరి శిక్షను వాయిదా వేస్తూ వచ్చారు. దీనిపై పాకిస్తాన్ ప్రత్యేకంగా ఫెడరల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీతో దర్యాప్తు చేయించింది. ఎఫ్ఐఏ నివేదిక ఇంక బహిర్గతం కానప్పటికీ, హత్య చేసేనాటికే షాకత్ అనే వ్యక్తి మేజర్ అని తేల్చినట్లు సమాచారం. ఈ నివేదిక […]
BY Pragnadhar Reddy24 April 2015 11:41 PM IST
X
Pragnadhar Reddy Updated On: 25 April 2015 5:56 AM IST
పదకొండు సంవత్సరాల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఏడేళ్ళ బాలుడిని హత్య చేసిన వ్యక్తికి మే 6న ఉరి శిక్ష విధించబోతున్నారు. అయితే హత్య చేసిన నాటికి షాకత్ అనే వ్యక్తి మైనర్ అనే ఆలోచనతో ఉరి శిక్షను వాయిదా వేస్తూ వచ్చారు. దీనిపై పాకిస్తాన్ ప్రత్యేకంగా ఫెడరల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీతో దర్యాప్తు చేయించింది. ఎఫ్ఐఏ నివేదిక ఇంక బహిర్గతం కానప్పటికీ, హత్య చేసేనాటికే షాకత్ అనే వ్యక్తి మేజర్ అని తేల్చినట్లు సమాచారం. ఈ నివేదిక అందుకున్న ప్రభుత్వం హత్యా చేసినందుకు ఉరిశిక్ష పడిన ముద్దాయికి డెత్ వారెంట్ జారీ చేసింది. ప్రభుత్వం వారెంట్ తెలిసిన ముద్దాయి లాయర్, అతని కుటుంబ సబ్యులు ఆశ్చర్యపోయారు. షాకత్ వయస్సు నిర్ధారణ కేసు ఇంకా హైకోర్టులోపెండింగ్‌లో ఉండగానే ఎలా ఉరితీస్తారని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసులో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కూడా జోక్యం చేసుకున్నాయి. ఎటువంటి అవాంతరాలు రాకపోతే మే ఆరున షాకత్ ఉరి ఖాయం.
Next Story