సైకిల్‌ను వెంటాడుతున్న కారు..
తెలంగాణ రాష్ట్రంలో చాన్నాళ్ళుగా కారు, సైకిల్ మధ్య రేస్ జరుగుతోంది. సహజంగా కారు యంత్రం గనుక స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. సైకిల్‌ను మనిషే స్వయంగా నడపాలి గనుక వేగం తక్కువ. ఈ రెండింటికి పోలిక ఎందుకంటే సైకల్ గుర్తున్న తెలుగుదేశం పార్టీని, కారు గుర్తున్న టీఆర్రెస్ అన్నివిధాలా ఓవర్‌టేక్ చేస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్రెస్, తెలుగుదేశాన్ని ఓ పట్టుపడుతోంది. ఉద్యమ కాలం నుంచే టీడీపీ నేతలపై గురిపెట్టిన కేసీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరింత పట్టు బిగిస్తోంది. […]
BY Pragnadhar Reddy24 April 2015 12:35 AM GMT
X
Pragnadhar Reddy Updated On: 29 Oct 2015 1:22 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో చాన్నాళ్ళుగా కారు, సైకిల్ మధ్య రేస్ జరుగుతోంది. సహజంగా కారు యంత్రం గనుక స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. సైకిల్‌ను మనిషే స్వయంగా నడపాలి గనుక వేగం తక్కువ. ఈ రెండింటికి పోలిక ఎందుకంటే సైకల్ గుర్తున్న తెలుగుదేశం పార్టీని, కారు గుర్తున్న టీఆర్రెస్ అన్నివిధాలా ఓవర్‌టేక్ చేస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్రెస్, తెలుగుదేశాన్ని ఓ పట్టుపడుతోంది. ఉద్యమ కాలం నుంచే టీడీపీ నేతలపై గురిపెట్టిన కేసీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరింత పట్టు బిగిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆకర్షిస్తోంది. శాసనమండలిలోని టీడీపీ మొత్తంగా అధికార పార్టీలో విలీనమైనట్లుగా లేఖ కూడా ఇచ్చేశారు. గతంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌లో చేరిపోగా తాజాగా రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్టణం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కారెక్కారు. మంచిరెడ్డిని ఆపేందుకు చంద్రబాబు, లోకేష్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి పాలమూర్ సభలో రంగారెడ్డి జిల్లాకు కొత్త అధ్యక్షుడిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అధ్యక్షులుగా పనిచేసిన నేతలు టీడీపీ నుంచి వెళ్ళి పోవడం రివాజుగా మారింది. గతంలో దేవేంద్రగౌడ్ నుంచి మహేందర్‌రెడ్డి వరకు మొత్తం నలుగురు టీడీపీకి దూరమయ్యారు. తాజాగా మంచిరెడ్డి జంప్ చేశారు. ప్రకాశ్‌గౌడ్ కూడా టీఆర్ ఎస్ ప్లీనరీలో గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన్నే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. గతంలో ఒకసారి కేసీఆర్‌తో ప్రకాశ్‌గౌడ్ మంతనాలు కూడా జరిపినట్లు సమాచారం. తన నియోజకవర్గ అభివృద్ధి తనకు ముఖ్యమని కార్యకర్తలు ఎలా చెబితే అలా నడుచుకుంటానని కూడా ప్రకాశ్‌గౌడ్ ఇదివరకే ప్రకటించారు. మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎంతకాలం ఉంటారో చూడాలి.
Next Story