వారాంతంలోనూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు
ముంబయి: శుక్రవారం మూడోరోజు కూడా మరోసారి నష్టాల బాటనే ఎంచుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ కూడా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సాయంత్రానికి నష్టాలనే రికార్డు చేశాయి. మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా పాజిటివ్ ట్రెండ్ కనిపించలేదు. సెన్సెక్స్ ఈరోజు 297 పాయింట్లు కోల్పోయి 27,437 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీలో కూడా కదలికలు నేల చూపులు చూస్తూనే మార్కెట్ ముగిశాయి. మార్కెట్లో అమ్మకాలు కొనసాగడంతో నిఫ్టి 93 పాయింట్లు నష్టపోయి 8305 దగ్గర ముగిసింది. గోద్రేజ్ క్యాపిటల్, ఎన్ఎండీసీ, […]
BY Pragnadhar Reddy24 April 2015 6:43 AM IST
Pragnadhar Reddy Updated On: 24 April 2015 2:45 PM IST
ముంబయి: శుక్రవారం మూడోరోజు కూడా మరోసారి నష్టాల బాటనే ఎంచుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ కూడా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సాయంత్రానికి నష్టాలనే రికార్డు చేశాయి. మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా పాజిటివ్ ట్రెండ్ కనిపించలేదు. సెన్సెక్స్ ఈరోజు 297 పాయింట్లు కోల్పోయి 27,437 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీలో కూడా కదలికలు నేల చూపులు చూస్తూనే మార్కెట్ ముగిశాయి. మార్కెట్లో అమ్మకాలు కొనసాగడంతో నిఫ్టి 93 పాయింట్లు నష్టపోయి 8305 దగ్గర ముగిసింది. గోద్రేజ్ క్యాపిటల్, ఎన్ఎండీసీ, భారత్ ఫోర్జ్ షేర్లు కొద్దిగా లాభాల్లో ముగిశాయి. స్పార్క్, జెట్ ఎయిర్‌వేస్ 8 శాతం పైగా నష్టపోయాయి. శుక్రవారం ఇన్‌ఫోసిస్‌లో అత్యధిక టర్నోవర్ నమోదైంది. దాదాపు మూడొందల కోట్లపైగా షేర్ లావాదేవీలు జరిగాయి.-పీఆర్
Next Story