తాను మారి పార్టీని మారుస్తున్నాడా?
కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ మారిపోయారా? రెండు నెలల క్రితం వరకు విపక్షాల చేత పనికిరాని నాయకుడుగా కీర్తించబడ్డ రాహుల్ గాంధీలో అజ్ఞాతం నుంచి వచ్చాక చాలా మార్పు కనిపిస్తోంది. తనను తాను నిరూపించుకోవడానికి 19న జరిగిన కిసాన్‌ర్యాలీనుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. నెట్ న్యూట్రాలిటీ, రైతుల ఆత్మహత్యలు, భూ సేకరణ బిల్లుపైనా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా దాడి చేశారు. అటు తల్లికి పుత్రుడిని చూసుకుని సంతోషం కలిగేలా చేశారు. ఇటు పార్టీ నాయకులతో కూడా శెభాష్ అనిపించుకుంటున్నారు. […]
BY Pragnadhar Reddy24 April 2015 7:13 AM IST
X
Pragnadhar Reddy Updated On: 24 April 2015 7:21 AM IST
కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ మారిపోయారా? రెండు నెలల క్రితం వరకు విపక్షాల చేత పనికిరాని నాయకుడుగా కీర్తించబడ్డ రాహుల్
గాంధీలో అజ్ఞాతం నుంచి వచ్చాక చాలా మార్పు కనిపిస్తోంది. తనను తాను నిరూపించుకోవడానికి 19న జరిగిన కిసాన్‌ర్యాలీనుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. నెట్ న్యూట్రాలిటీ, రైతుల ఆత్మహత్యలు, భూ సేకరణ బిల్లుపైనా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా దాడి చేశారు. అటు తల్లికి పుత్రుడిని చూసుకుని సంతోషం కలిగేలా చేశారు. ఇటు పార్టీ నాయకులతో కూడా శెభాష్ అనిపించుకుంటున్నారు. అధికార బీజేపీ నేతల చేత ఔరా అనిపించుకుంటున్నారు. రెండు నెలల విరామం తీసుకున్న సమయంలో ఎక్కడ ఎటువంటి విద్య అభ్యసించారో, ఏ ధ్యానం చేశారో మొత్తానికి మొత్తానికి రాహుల్‌కు జ్ఞానోదయం కలిగింది. తాను మారి పార్టీని మార్చి అధికారం పీఠం దిశగా ప్రయాణం చేయించాలని రాహుల్‌గాంధీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ అంటేనే సెక్యులర్ పార్టీ అనే పేరుంది. నిజానికి రామజన్మభూమి వ్యవహారంతో సహా అనేక సంఘటనల్లో మెజారిటీ మతానికి అనుకూలంగా వ్యవహరించిన దాఖలాలున్నా లౌకిక పార్టీగా, మైనారిటీ అనుకూల పార్టీగా కాంగ్రెస్‌కు పేరుంది. దీన్ని ఆసరా చేసుకునే గత ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేక పార్టీగా ముద్ర వేయగలిగింది. దేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల ఓట్లు కొల్లగొట్టడానికి బీజేపీ కాంగ్రెస్‌ను యాంటీ హిందూ పార్టీగా ప్రొజెక్ట్ చేసి విజయవంతమైంది. ఇప్పడు ఆ ముద్రనే చెరిపేయడానికి రాహుల్ కంకణం కట్టుకున్నారు. సాధారణంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ చేయని సాహసం రాహుల్ చేస్తున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం అయిన కేదార్‌నాథ్ యాత్రకు రాహుల్ బయల్దేరారు. రాజకీయ పార్టీల్లో ముఖ్యనేతలెవరూ పనికట్టుకుని ఇటువంటి సాహసోపేత యాత్రలు చేయలేదు. ఏవైనా కార్యక్రమాలు ఉన్నపుడు వెళ్ళడం జరుగుతుంటుంది. కాని రాహుల్‌గాంధీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల్లో రెండేళ్ళ క్రితం ఆకస్మిక వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న కేదార్‌నాథ్‌ను సందర్శించడానికి వెళ్ళడమే ఇప్పడు రాజకీయపార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌కు ఉన్న హిందూ వ్యతిరేక ముద్ర తుడిచేయడానికా అన్నట్లుగా రాహుల్ గాంధీ టూర్ మొదలైంది. మొత్తానికి అధఃపాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్‌ను ఉన్నతస్థాయికి తీసుకురావడానికి అచ్చమైన రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందారు యువరాజు రాహుల్‌గాంధీ.
Next Story