Telugu Global
Others

మూడునాలుగు రోజుల్లో పీఆర్‌సీ చెల్లింపులు: య‌న‌మ‌ల హామీ

హైద‌రాబాద్‌: ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుతో ఆంద్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగ సంఘాల నాయ‌కులు స‌మావేశ‌మై మాస్ట‌ర్ స్కేలు మార్చాలంటూ మెలిక పెడుతున్న వైనాన్ని ప్ర‌స్తావించి త‌మ అసంతృప్తి తెలియ‌జేశారు. ఇది ఉద్యోగుల‌కు న‌ష్ట‌దాయ‌క‌మ‌ని వారు ఆయ‌న‌తో అన్నారు. దాదాపు వెయ్యి కోట్ల మేర ఉద్యోగులు న‌ష్ట‌పోతార‌ని వార‌న్నారు. గ‌త తొమ్మిది పీఆర్‌సీల‌కు వ‌ర్తింపేజేయ‌ని నిబంధ‌న‌లు ఇప్పుడెందుకు కొత్త‌గా తెర మీద‌కు తెస్తున్నార‌ని ఉద్యోగ సంఘాలు ప్ర‌శ్నించాయి. దీనివ‌ల్ల నాలుగు ల‌క్ష‌ల మంది ఉద్యోగులు, మూడున్న‌ర ల‌క్ష‌ల మంది పెన్ష‌న‌ర్లు […]

హైద‌రాబాద్‌: ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుతో ఆంద్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగ సంఘాల నాయ‌కులు స‌మావేశ‌మై మాస్ట‌ర్ స్కేలు మార్చాలంటూ మెలిక పెడుతున్న వైనాన్ని ప్ర‌స్తావించి త‌మ అసంతృప్తి తెలియ‌జేశారు. ఇది ఉద్యోగుల‌కు న‌ష్ట‌దాయ‌క‌మ‌ని వారు ఆయ‌న‌తో అన్నారు. దాదాపు వెయ్యి కోట్ల మేర ఉద్యోగులు న‌ష్ట‌పోతార‌ని వార‌న్నారు. గ‌త తొమ్మిది పీఆర్‌సీల‌కు వ‌ర్తింపేజేయ‌ని నిబంధ‌న‌లు ఇప్పుడెందుకు కొత్త‌గా తెర మీద‌కు తెస్తున్నార‌ని ఉద్యోగ సంఘాలు ప్ర‌శ్నించాయి. దీనివ‌ల్ల నాలుగు ల‌క్ష‌ల మంది ఉద్యోగులు, మూడున్న‌ర ల‌క్ష‌ల మంది పెన్ష‌న‌ర్లు న‌ష్ట‌పోతార‌ని వారు తెలిపారు. ఈ విష‌య‌మై స్పందిస్తూ య‌న‌మ‌ల ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఉద్యోగుల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. మూడు, నాలుగు రోజుల్లో ప్ర‌క‌టిత పీఆర్‌సీ మేర‌కు చెల్లింపుల‌కు ఆదేశాలిస్తామ‌ని ఆర్థిక మంత్రి భ‌రోసా ఇవ్వ‌డంతో నాయ‌కులు సంతృప్తి వ్య‌క్తం చేశారు.
First Published:  24 April 2015 2:46 AM IST
Next Story