టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎఎస్)) ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం నుంచి ఈ సమావేశాలకు దాదాపు 36 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. ప్లీనరీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 13 వందల మంది పోలీసులను మోహరిస్తున్నారు. ప్లీనరీ నిర్వహించే ఎల్.బి.నగర్ స్టేడియంను ఇప్పటికే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, ఈటెల రాజేందర్, పద్మారావులు నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా ఎంపీ కె.కేశవరావు సమన్వయం చేస్తున్నారు. దాదాపు […]
BY Pragnadhar Reddy23 April 2015 1:14 AM IST
Pragnadhar Reddy Updated On: 23 April 2015 7:16 AM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎఎస్)) ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం నుంచి ఈ సమావేశాలకు దాదాపు 36 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. ప్లీనరీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 13 వందల మంది పోలీసులను మోహరిస్తున్నారు. ప్లీనరీ నిర్వహించే ఎల్.బి.నగర్ స్టేడియంను ఇప్పటికే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, ఈటెల రాజేందర్, పద్మారావులు నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా ఎంపీ కె.కేశవరావు సమన్వయం చేస్తున్నారు. దాదాపు 50 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. వంటకాల్లో తెలంగాణ రుచులను మోహరించేలా చర్యలు తీసుకుంటున్నారు. శాకాహారం, మాంసాహారంతో కూడిన ఆహారం వండి వడ్డిస్తారు. అయితే భోజన ఏర్పాట్లు మాత్రం ఎల్.బి.నగర్ స్టేడియంలో కాకుండా పక్కనే ఉన్న నిజాం కాలేజీలో చేశారు. ఎండాకాలం అయినందున ప్లీనరీకి వచ్చే వారెవరూ ఇబ్బంది పడకుండా ఉండేందుకు మంచి నీటి సౌకర్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్లీనరీని ప్రతిబింబింపజేయడానికి ఆరు పెద్ద బెలూన్లను ఎల్.బి.నగర్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇవికాక హైదరాబాద్ నగరమంతా కనిపించే విధంగా మరో 20 బెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు.
Next Story