మళ్ళీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
ముంబయి: నిన్నామొన్నా కొంచెం మురిపించిన స్టాక్ మార్కెట్లు గురువారం మరోసారి నష్టాల బాటనే ఎంచుకున్నాయి. ప్రారంభంలో పాజిటివ్‌గా ఉన్న సెన్సెక్స్, నిఫ్టీ కూడా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సాయంత్రానికి నష్టాలనే చవి చూసింది. ఉదయం 9.15కు మార్కెట్లు ప్రారంభమైన వెంటనే ట్రెండ్ పాజిటివ్‌గా కనిపించింది. బుధవారం 27890 వద్ద క్లోజయిన సెన్సెక్స్ ఈరోజు ఒక దశలో 28 వేల మార్కును దాటేందుకు నానా తంటాలు పడింది. అయితే అది కొద్దిసేపే. తర్వాత క్రమంగా దిగజారుతూ 155 పాయింట్లు […]
BY Pragnadhar Reddy23 April 2015 5:58 AM IST
Pragnadhar Reddy Updated On: 23 April 2015 12:02 PM IST
ముంబయి: నిన్నామొన్నా కొంచెం మురిపించిన స్టాక్ మార్కెట్లు గురువారం మరోసారి నష్టాల బాటనే ఎంచుకున్నాయి. ప్రారంభంలో పాజిటివ్‌గా ఉన్న సెన్సెక్స్, నిఫ్టీ కూడా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సాయంత్రానికి నష్టాలనే చవి చూసింది. ఉదయం 9.15కు మార్కెట్లు ప్రారంభమైన వెంటనే ట్రెండ్ పాజిటివ్‌గా కనిపించింది. బుధవారం 27890 వద్ద క్లోజయిన సెన్సెక్స్ ఈరోజు ఒక దశలో 28 వేల మార్కును దాటేందుకు నానా తంటాలు పడింది. అయితే అది కొద్దిసేపే. తర్వాత క్రమంగా దిగజారుతూ 155 పాయింట్లు పడిపోయి 27735 వద్ద క్లోజయ్యింది. అలాగే నిఫ్టీలో కూడా కదలికలు ఇన్వెస్టర్ సహనానికి పరీక్ష పెట్టాయి. మార్కెట్ల ప్రారంభంలో పాజిటివ్‌గానే కనిపించినప్పటికీ తర్వాత నెగిటివ్ ట్రెండ్‌లోకి వెళ్ళి పోయింది. నిఫ్టీ కూడా ఒక దశలో నిన్నటి క్లోజింగ్‌ను దాటి 8501 మార్కును దాటింది. అయితే ఆ తర్వాత క్రమంగా మార్కెట్లో అమ్మకాలు కొనసాగడంతో 8367 వద్దకు చేరి క్లోజయ్యింది. ఎస్ బ్యాంక్, టాటా స్టీల్, నైవేలీ లిగ్నైట్, రాజేశ్ ఇండస్ట్రీస్ ఈవేళ లాభపడిన షేర్ల జాబితాలో ఉండగా గీతాంజలి, ట్రెంట్, గోద్రేజ్ క్యాపిటల్‌లు బాగా నష్టపోయాయి. నిఫ్టిలో 17 షేర్లు లాభాల బాట పట్టగా 33 షేర్లు నష్టాల దారిలో నడిచాయి. వంద కోట్లకు పైగా టర్నోవర్ జరిగిన షేర్లలో ఈవేళ సన్‌ఫార్మా, ఎస్ బ్యాంకులున్నాయి.
Next Story