ఈ పాపం బిజెపీ ది కాదా ?
దేశంలో రైతుల పరిస్థితులు రోజు రోజుకు ఎంత దిగజారుతున్నాయో ఢిల్లీలో జరిగిన రైతు ఆత్మహత్య తెలియచేస్తోంది. ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకువస్తున్న భూ సేకరణ సవరణచట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో ఒక ర్యాలీ నిర్వహించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రసంగిస్తున్న సమయంలోనే రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక రైతు చెట్టుపైన కొమ్మకు ఉరివేసుకున్నాడు. పంట నష్టాల వల్లే తాను ఉరి వేసుకున్నట్లు ఆయన జేబులో ఒక ఉత్తరం పోలీసులకు దొరికింది. రైతు ఆత్మహత్యకు కే్జ్రీవాల్ కారణమని బీజేపీ […]
దేశంలో రైతుల పరిస్థితులు రోజు రోజుకు ఎంత దిగజారుతున్నాయో ఢిల్లీలో జరిగిన రైతు ఆత్మహత్య తెలియచేస్తోంది. ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకువస్తున్న భూ సేకరణ సవరణచట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో ఒక ర్యాలీ నిర్వహించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రసంగిస్తున్న సమయంలోనే రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక రైతు చెట్టుపైన కొమ్మకు ఉరివేసుకున్నాడు. పంట నష్టాల వల్లే తాను ఉరి వేసుకున్నట్లు ఆయన జేబులో ఒక ఉత్తరం పోలీసులకు దొరికింది. రైతు ఆత్మహత్యకు కే్జ్రీవాల్ కారణమని బీజేపీ నేతలు నిందిస్తే, కాదు మీరే కారణమని ఆప్ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇక్కడ వ్యక్తులుగా ఎవరు కారణమన్నది ప్రశ్నకాదు. తన పంట నష్టాల కారణంగానే చనిపోతున్నట్లు రైతు స్వయంగా లేఖ రాసినందున దీనికి రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఒకవైపు భూ సేకరణ చట్ట సవరణకు దేశమంతా నిరసనలు వ్యక్తమవుతున్నా తమకు మద్దతుగా ఉన్న కార్పొరేట్ కంపెనీలకు లాభం కలిగే రీతిలో మోదీ ప్రభుత్వం ఇప్పటికి రెండు చట్టాలన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంట్ ముందుంది. లోక్‌సభలో ఆమోదం పొందినా, రాజ్యసభలో ఆ బిల్లు నెగ్గే ప్రసక్తే లేదు. అందుకే ఉభయ సభల్ని ఒకేసారి సమావేశపరిచి ఆమోదించుకోవాలనే ఆలోచన చేస్తోంది.