ఇంటర్ ఫస్టియర్‌లో కృష్ణాజిల్లా టాప్
విజయవాడ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలను హెచ్ ఆర్ డి మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విజయవాడలో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 76 శాతంతో కృష్ణా జిల్లా ప్రధమ స్థానంలోను, 59 శాతంతో కడప జిల్లా చివరి స్థానంలోను నిలిచాయి. ఉత్తీర్ణత శాతం గత యేడాది కంటే ఈసారి 4 శాతం పెరిగింది. మొత్తం 62.98 శాతం మంది ఈ పరీక్షల్లో పాసైనట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో బాలిక శాతం 67 […]
BY Pragnadhar Reddy23 April 2015 7:04 AM IST
Pragnadhar Reddy Updated On: 23 April 2015 12:18 PM IST
విజయవాడ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలను హెచ్ ఆర్ డి మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విజయవాడలో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 76 శాతంతో కృష్ణా జిల్లా ప్రధమ స్థానంలోను, 59 శాతంతో కడప జిల్లా చివరి స్థానంలోను నిలిచాయి. ఉత్తీర్ణత శాతం గత యేడాది కంటే ఈసారి 4 శాతం పెరిగింది. మొత్తం 62.98 శాతం మంది ఈ పరీక్షల్లో పాసైనట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో బాలిక శాతం 67 ఉండగా బాలుర శాతం 59 ఉంది. జనరల్ కేటగిరిలో 52 శాతం మందికి ఏ గ్రేడ్ లభించిందని, అలాగే ఒకేషనల్ కేటగిరిలో 60 శాతం మందికి ఏ గ్రేడ్ లభించిందని మంత్రి గంటా తెలిపారు. మే 25 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. జనరల్‌లో 79 మందిపైన, ఒకేషనల్‌లో 12 మందిపై మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు.
Next Story