అమరావతిలో హైదరాబాద్..
ఆంధ్రుల కొత్త రాజధానిలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మించానని చెప్పకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పడు కొత్తగా నిర్మించే ఏపీ రాజధాని కూడా అచ్చం హైదరాబాద్ మాదిరిగానే ఉండాలని కోరుకుంటున్నారు. అదే హైదరాబాద్…అదే కేంద్రీకరణ..అభివృద్ధి అంతా ఒకేచోట పోగుపడటం వంటి హైదరాబాద్‌ను ముమ్మూర్తులా ఏపీలో దించేయడానికి బాబు కంకణం కట్టుకున్నారు. అమరావతి నగరాన్ని నిర్మిస్తే సరిపోదు కదా..అందుకే హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ లాంటి ఓ సుందర జలాశయాన్ని కూడా నిర్మించాలని […]
ఆంధ్రుల కొత్త రాజధానిలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మించానని చెప్పకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పడు కొత్తగా నిర్మించే ఏపీ రాజధాని కూడా అచ్చం హైదరాబాద్ మాదిరిగానే ఉండాలని కోరుకుంటున్నారు. అదే హైదరాబాద్…అదే కేంద్రీకరణ..అభివృద్ధి అంతా ఒకేచోట పోగుపడటం వంటి హైదరాబాద్‌ను ముమ్మూర్తులా ఏపీలో దించేయడానికి బాబు కంకణం కట్టుకున్నారు. అమరావతి నగరాన్ని నిర్మిస్తే సరిపోదు కదా..అందుకే హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ లాంటి ఓ సుందర జలాశయాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించారు. వెయ్యి ఎకరాల్లో ఒక పెద్ద చెరువు, దానికి ఆనుకుని ఒక ట్యాంక్‌బండ్ నిర్మించేవిధంగా ప్లాన్ తయారుచేయమని తన సింగపూర్ మిత్రులను బాబు కోరారని, వారు అందుకు అంగీకరించారని, ఈ విషయాన్ని క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి తమకు వివరించారని మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిలో మరో్ హుస్సేన్‌సాగర్ తయారవుతుందన్నమాట. దానికి ఏం పేరు పెడతారో ఇంకా నిర్ణయించలేదు. ట్యాంక్‌బండ్‌పై ఎవరి విగ్రహాలు పెట్టాలో కూడా ఇంకా నిర్ణయించలేదు. అవి కూడా త్వరలోనే ప్రకటిస్తారు. ఇక రాజధాని నగరానికి వచ్చే అతిధుల మానసికోల్లాసానికి నదికి ఇటువైపు కృష్ణా జిల్లా తీరంలో పది వేల ఎకరాల వరకు భూమి సమీకరించాలని కూడా క్యాబినెట్‌లో నిర్ణయించారు. నదికి రెండు వైపులా టూరిజంను అభివృద్ధి చేయడానికి కొత్తగా ఈ భూ సమీకరణ చేస్తారు. సమీకరించిన భూమిలో ప్రయివేటు రంగంలో టూరిజం ప్రాజెక్టులు చేపడతారు,.