ఇంటర్నేషనల్ మీడియాకు బాహుబలి..!
తెలుగు దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా చెక్కుతున్న బాహుబలి చిత్రం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ చిత్రం గత సంవత్సరం కాలం నుంచి మన జాతీయ మీడియాలో నలుగుతుంది. తాజాగా రామోజి ఫిల్మ్ సిటిలో బాహుబలి షూటింగ్ కోసం వేసిన వంద అడుగుల రానా విగ్రహం( భళాల దేవుడు) , ఏనుగులు, గుర్రాలు, ఒంటెల కు సంబంధించిన సెట్స్ ను ఎలా తీర్చి దిద్దారో చిత్ర […]
తెలుగు దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా చెక్కుతున్న బాహుబలి చిత్రం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ చిత్రం గత సంవత్సరం కాలం నుంచి మన జాతీయ మీడియాలో నలుగుతుంది. తాజాగా రామోజి ఫిల్మ్ సిటిలో బాహుబలి షూటింగ్ కోసం వేసిన వంద అడుగుల రానా విగ్రహం( భళాల దేవుడు) , ఏనుగులు, గుర్రాలు, ఒంటెల కు సంబంధించిన సెట్స్ ను ఎలా తీర్చి దిద్దారో చిత్ర బృందాని అడిగి తెలుసుకున్నారు.మహిష్మితి రాజ్యంకోసం రాజమౌళి తీర్చిదిద్దన సెట్టింగ్స్ అన్నింటిని రాజమౌళి అంతర్జాతీయ మీడియా బృందానికి చూపారు.
దీంతో బాహుబలి మేకింగ్ న్యూస్ అనేది ఇంటర్నేషనల్ గా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రభాసె్, అనుష్క, రానా, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. సంగీతం కీరవాణి అందిస్తున్నారు.సెంథిల్ సినిమాటోగ్రఫి. ఆర్కామీడియా వర్క్స పై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ముందుగా మే నెల 17 న రిలీజ్ వుంటుందనే వార్త బయటకు వచ్చింది. అయితే రాజమౌళి మాత్రం అధికారికంగా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. జూన్ లో రావోచ్చు అనేది ఇంటర్నల్ గా వినిపిస్తున్న టాక్. బాహుబలి ..ది బిగినింగ్ పేరు తో ఫస్ట్ పార్ట్ వస్తుంది. సెకండ్ పార్ట్ కు ఆగష్టు నుంచి రంగంలోకి దిగతారని టాక్.