Telugu Global
Cinema & Entertainment

 ఈ వీకెండ్ దోచేయడానికి చాలా అవకాశం

నాగాచైతన్య లేటెస్ట్ మూవీ దోచేయ్. సరైన సమయంలో ఈ సినిమా వస్తోంది. టైమింగ్ అదిరిపోయింది. ఎందుకుంటే.. సన్నాఫ్ సత్యమూర్తి ఇప్పటికే థియేటర్ల వద్ద చల్లబడిపోయింది. మరోవైపు ఓకే బంగారం సినిమా ఓకే అనిపించుకున్నప్పటికీ మ్యాగ్జిమమ్ ఇంకో 4 రోజులు మాత్రమే వసూళ్లు వస్తాయి. సో.. మరో పెద్ద సినిమా లైన్ లో లేకపోవడంతో చైతూ నటించిన దోచేయ్ సినిమాకి మాంఛి టైమింగ్ సెట్ అయింది. నిజంగా సినిమాలో స్టఫ్ ఉంటే నాగచైతన్య బాక్సాఫీస్ ను దోచేయడం ఖాయం. […]

 ఈ వీకెండ్ దోచేయడానికి చాలా అవకాశం
X
నాగాచైతన్య లేటెస్ట్ మూవీ దోచేయ్. సరైన సమయంలో ఈ సినిమా వస్తోంది. టైమింగ్ అదిరిపోయింది. ఎందుకుంటే.. సన్నాఫ్ సత్యమూర్తి ఇప్పటికే థియేటర్ల వద్ద చల్లబడిపోయింది. మరోవైపు ఓకే బంగారం సినిమా ఓకే అనిపించుకున్నప్పటికీ మ్యాగ్జిమమ్ ఇంకో 4 రోజులు మాత్రమే వసూళ్లు వస్తాయి. సో.. మరో పెద్ద సినిమా లైన్ లో లేకపోవడంతో చైతూ నటించిన దోచేయ్ సినిమాకి మాంఛి టైమింగ్ సెట్ అయింది. నిజంగా సినిమాలో స్టఫ్ ఉంటే నాగచైతన్య బాక్సాఫీస్ ను దోచేయడం ఖాయం. మరోవైపు దోచేయ్ కు పోటీగా చిన్నాచితకా సినిమాలు మాత్రమే లిస్ట్ లో ఉన్నాయి.
మనోజ్ నందం, మాదాల రవి, బ్రహ్మాజీ లాంటి నటులు నటించిన అలౌకిక సినిమా ఈ వీకెండ్ విడుదలవుతోంది. రామ్ ఖన్నా, మానస్, జోష్ రవి నటించిన కాయ్ రాజా కాయ్ కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ రెండు సినిమాలు గురువారం విడుదలవుతున్నాయి. శుక్రవారం విడుదలకానున్న దోచేయ్ సినిమాకు ఈ రెండు మూవీస్ ఏమాత్రం పోటీ ఇవ్వవు. మరోవైపు దోచేయ్ తర్వాత ఒక రోజు గ్యాప్ లో వస్తోంది తిమ్మిరి. తమిళ్ లో శింబు చేసిన ఓస్తి సినిమాకి డబ్బింగ్ ఇది. హిందీలో హిట్టయిన దబంగ్ సినిమాకి రీమేక్. పైగా తెలుగులో ఈ సినిమాని పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ పేరుతో ఎప్పుడో చేసేశాడు. కాబట్టి తిమ్మిరిపై ఎలాంటి అంచనాల్లేవు. సో.. నాగచైతన్యకు దోచేయడానికి బోలెడంత స్కోప్ ఉందన్నమాట.
First Published:  22 April 2015 12:57 AM
Next Story