హాట్‌హాట్‌గా ఏపీ కేబినెట్ భేటీ?
బుధవారం జరిగిన మంత్రివర్గం సమావేశం హాట్‌హాట్‌గా జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా తమ వైఖరి మార్చుకోకపోవడం పట్ల ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు ఇరువురు తమ మధ్య ఉన్న విభేదాలను వీడనాడడం లేదని… ఇది పద్ధతి కాదని ఆయన మందలించారు. మూడు రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో తెలుగుదేశం గెలవడానికి కారణం అధికార పార్టీ బలం, తాము కాదని… కేవలం ప్రతిపక్షం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని […]
BY Pragnadhar Reddy22 April 2015 10:47 AM IST
X
Pragnadhar Reddy Updated On: 22 April 2015 10:47 AM IST
బుధవారం జరిగిన మంత్రివర్గం సమావేశం హాట్‌హాట్‌గా జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా తమ వైఖరి మార్చుకోకపోవడం పట్ల ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు ఇరువురు తమ మధ్య ఉన్న విభేదాలను వీడనాడడం లేదని… ఇది పద్ధతి కాదని ఆయన మందలించారు. మూడు రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో తెలుగుదేశం గెలవడానికి కారణం అధికార పార్టీ బలం, తాము కాదని… కేవలం ప్రతిపక్షం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబు తీవ్రంగా మండిపడి ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు. సమావేశం ముగిశాక మంత్రి గంటా మొహం మాడ్చుకుని వెళ్ళిపోగా అయ్యన్నపాత్రుడు మాత్రం తననేదో అడగవచ్చని విలేఖరులపై ఆ కోపాన్ని చూపుతూ మీకేం చెప్పినా అర్ధం కాదు… మీరేదో అనుకున్నది రాసేస్తారు… అంటూ విసురుగా వెళ్ళిపోయారు. దీంతో విలేకరులు అవాక్కయ్యారు. అదే సమావేశంలో దేవినేని ఉమ, రావెల కిషోర్‌బాబు వ్యవహారశైలిని బాబు మెచ్చుకున్నట్టు తెలిసింది.
Next Story