ఎంపీలకు బాబు వార్నింగ్..
ఆంధ్రా ఒలింపిక్ అసోసియేషన్ నాదంటే నాదేనంటూ కిందా మీదా పడుతున్న తెలుగుదేశం ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లిద్దరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే. ఇద్దరూ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలే. అయితే ఇద్దరు కన్నూ ఆంధ్రా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవిపై పడింది. ఎవరికి వారే తమదే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉన్న సంఘమంటూ ఎన్నికలు జరిపించుకున్నారు. కోర్టులకెక్కారు. ఒక రకంగా ఒలింపిక్ అసోసియేషన్ పదవుల […]
ఆంధ్రా ఒలింపిక్ అసోసియేషన్ నాదంటే నాదేనంటూ కిందా మీదా పడుతున్న తెలుగుదేశం ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లిద్దరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే. ఇద్దరూ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలే. అయితే ఇద్దరు కన్నూ ఆంధ్రా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవిపై పడింది. ఎవరికి వారే తమదే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉన్న సంఘమంటూ ఎన్నికలు జరిపించుకున్నారు. కోర్టులకెక్కారు. ఒక రకంగా ఒలింపిక్ అసోసియేషన్ పదవుల కోసం తెలుగుదేశం పార్టీ పరువు బజారుకీడ్చారు. వీరిద్దరి వ్యవహారం శృతి మించుతుండటంతో ఢిల్లీలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇద్దరినీ బాబు మందలించారు. పార్లమెంట్‌లో బోలెడు పనులుంటే ఇదేం గోలంటూ మండిపడ్డారు. ఒలింపిక్ అసోసియేషన్ గొడవలకు దూరంగా ఉండాలంటూ ఇద్దరికీ క్లాస్ పీకారు. ఒలింపిక్ అసోసియేషన్ పదవిని ఏ పదవి లేనివారికిద్దామంటూ గల్లా జయదేవ్, సీఎం రమేష్‌ల ఆశలపై నీళ్ళు చల్లారు. దీంతో ఆంధ్రా ఒలింపిక్ అసోసియేషన్ రాజకీయాట దారికొచ్చింది. ఇప్పుడిక ఆ పదవి కోసం తెలుగు తమ్ముళ్ళలో పోటీ మొదలవుతుంది.