Telugu Global
Cinema & Entertainment

ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ ఎసరు పెట్టింది

మొన్నటి వరకు బాలీవుడ్ లో ప్రత్యేక గీతాల్లో నటించాలంటే ఐటెంభామలు కావాల్సిందే. హాట్ ఐటెంభామ అంటే మలైకా అరోరానే. స్టార్ హీరోలంతా ఆమెతోనే ఐటెంసాంగ్స్ చేయించుకునేవాళ్లు. ఆ తర్వాత స్థానం మల్లికా షెరావత్ కు దక్కుతుంది. వీళ్లతో పాటు రాఖీసావంత్, షెర్లీన్ చోప్రా, పూనమ్ పాండే లాంటి హాట్ లేడీస్ కూడా ఐటెంసాంగ్స్ తో చెలరేగిపోయారు. అయితే తాజా పరిణామాలతో హీరోయిన్లే ఐటెంసాంగ్స్ చేస్తున్నారు. దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రా, కరీనాకపూర్ లాంటి స్టార్ హీరోయిన్లే ఇప్పుడు […]

ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ ఎసరు పెట్టింది
X

మొన్నటి వరకు బాలీవుడ్ లో ప్రత్యేక గీతాల్లో నటించాలంటే ఐటెంభామలు కావాల్సిందే. హాట్ ఐటెంభామ అంటే మలైకా అరోరానే. స్టార్ హీరోలంతా ఆమెతోనే ఐటెంసాంగ్స్ చేయించుకునేవాళ్లు. ఆ తర్వాత స్థానం మల్లికా షెరావత్ కు దక్కుతుంది. వీళ్లతో పాటు రాఖీసావంత్, షెర్లీన్ చోప్రా, పూనమ్ పాండే లాంటి హాట్ లేడీస్ కూడా ఐటెంసాంగ్స్ తో చెలరేగిపోయారు. అయితే తాజా పరిణామాలతో హీరోయిన్లే ఐటెంసాంగ్స్ చేస్తున్నారు. దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రా, కరీనాకపూర్ లాంటి స్టార్ హీరోయిన్లే ఇప్పుడు ఐటెంసాంగ్స్ కు కూడా చిందేయడంతో ప్రత్యేకంగా వాటికోసమే ఉన్న ఐటెంభామలకు పని తగ్గిపోయింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు సన్నీలియోన్ రాకతో ఐటెంభామలకు పూర్తిగా పనిలేకుండా పోయింది.

ఎక్కడో విదేశాల్లో పోర్న్ మూవీస్ చేసుకునే సన్నీలియోన్ ను తీసుకొచ్చి బాలీవుడ్ కు పరిచయం చేశాడు మహేష్ భట్. అలా వచ్చిన సన్నీ ఇండియాలో అతుక్కుపోయింది. డాన్స్ నేర్చుకుంది. కాస్తోకూస్తో యాక్టింగ్ నేర్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ ఐటెం అయిపోయింది. దీంతో షెర్లీన్ చోప్రా, పూనమ్ పాండే, రాఖీసావంత్ లాంటి తారల పొట్టకొట్టినట్టయింది. దీంతో వీళ్లంతా బాహాటంగానే ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటించారు. సన్నీలియోన్ ను ఓవైపు తిడుతూనే.. మరోవైపు తమకేం తక్కువంటూ బాలీవుడ్ దర్శక-నిర్మాతల్ని నిలదీస్తున్నారు. నిజమే.. వీళ్లకేం తక్కువ.

First Published:  21 April 2015 9:30 AM
Next Story