నష్టాల బాట తప్పని స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు ఐదో ట్రేడింగ్ సెషన్లో కూడా నష్టాల బాటలోనే పయనించాయి. నిన్న 556 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మంగళవారం మరో 210 పాయింట్లు నష్టపోయి 27676 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టి కూడా మరో 70 పాయింట్లు నష్టపోయి 8377 వద్ద ముగిసింది. మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ రెలిగేర్, డెన్, గోద్రేజ్ ఇండియా, సెంచురీ టెక్స్‌టైల్స్ షేర్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా సోమవారం 9 శాతం నష్టపోయిన రెలిగేర్ ఈరోజు 10.5 శాతం లాభపడింది. అలాగే […]
BY sarvi20 April 2015 10:57 PM IST
sarvi Updated On: 21 April 2015 4:59 PM IST
స్టాక్ మార్కెట్లు ఐదో ట్రేడింగ్ సెషన్లో కూడా నష్టాల బాటలోనే పయనించాయి. నిన్న 556 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మంగళవారం మరో 210 పాయింట్లు నష్టపోయి 27676 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టి కూడా మరో 70 పాయింట్లు నష్టపోయి 8377 వద్ద ముగిసింది. మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ రెలిగేర్, డెన్, గోద్రేజ్ ఇండియా, సెంచురీ టెక్స్‌టైల్స్ షేర్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా సోమవారం 9 శాతం నష్టపోయిన రెలిగేర్ ఈరోజు 10.5 శాతం లాభపడింది. అలాగే సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, సియేట్, అపోలో టైర్స్, టొరెంట్ ఫార్మాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సన్‌ఫార్మాలో ఈరోజు కోటికి పైగా షేర్లు లావాదేవీలు జరిగి అత్యధిక టర్నోవర్ నమోదు చేసింది. ఆ తర్వాత స్థానం జీ లిమిటెడ్ ఆక్రమించింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో ఈరోజు 586 షేర్లు లాభపడగా 809 షేర్లు నష్టాల బాట పట్టాయి.-పీఆర్
Next Story