Telugu Global
Others

సిగిరెట్‌ ప్యాకెట్ అంటే 10 టన్నుల ఎర్రచందనం

హైదరాబాద్‌:  :పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల కోడ్‌ భాష గుట్టు విప్పారు. స్మగ్లర్లు తరచూ సిగిరెట్‌, తబలా, చాక్లెట్‌ వంటి పదాలు ఉపయోగిస్తున్నట్టు తెలియడంతో పోలీసులు ఆ దిశగా దృష్టి సారించారు. వారి పరిశోధనలో కళ్లు తిరిగే నిజాలు బయటపడ్డాయి. విషయం తెలిసి సిగిరెట్‌, తబలా, చాకెట్ల కోడ్ భాష‌కు త‌ర్జుమా అర్ధం ఏమిటి? అని ఆరా తీశారు. అస‌లు విష‌యం తెలిసి అశ్చర్యపోయారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం సిగిరెట్‌ ప్యాకెట్‌ కావాలంటే పది టన్నుల ఎర్రచందనం […]

హైదరాబాద్‌: :పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల కోడ్‌ భాష గుట్టు విప్పారు. స్మగ్లర్లు తరచూ సిగిరెట్‌, తబలా, చాక్లెట్‌ వంటి పదాలు ఉపయోగిస్తున్నట్టు తెలియడంతో పోలీసులు ఆ దిశగా దృష్టి సారించారు. వారి పరిశోధనలో కళ్లు తిరిగే నిజాలు బయటపడ్డాయి. విషయం తెలిసి సిగిరెట్‌, తబలా, చాకెట్ల కోడ్ భాష‌కు త‌ర్జుమా అర్ధం ఏమిటి? అని ఆరా తీశారు. అస‌లు విష‌యం తెలిసి అశ్చర్యపోయారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం సిగిరెట్‌ ప్యాకెట్‌ కావాలంటే పది టన్నుల ఎర్రచందనం ఆర్డర్‌ అన్నమాట. తబలా కావాలంటే జపాన్‌కు ఎక్స్‌పోర్టు ఆర్డర్‌ వచ్చిందని అర్ధం. చాక్లెట్లు ఉన్నాయా అంటే సరుకు రెడీగా ఉంది డ‌ెలివరీ తీసుకోమ‌ని అర్థం. చిన్నచిన్న పదాలకు ఇంత అర్థం ఉందని తెలిసిన పోలీసులు అవాక్కయ్యారు.
First Published:  21 April 2015 4:41 AM IST
Next Story