తెరాస వైపు జంప్ జిలానీల చూపు!
పదవుల కోసం వెంపర్లాట, అధికారం కోసం ఆరాటం… ఈ రెండు రాజకీయ జంప్ జిలానీలను ప్రోత్సహిస్తున్నాయి. ఇవి తెలంగాణలో అటు తెలుగుదేశంలోను, ఇటు కాంగ్రెస్‌లోను కలవరం కలిగిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెరాసలో చేరుతున్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి మద్దతుగా అన్నట్టు ఆయన నియోజకవర్గమంతా కిషన్‌రెడ్డి ఫొటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. మామూలు పోస్టర్లయితే పర్వాలేదు. ఇవన్నీ గులాబి రంగును సంతరించుకున్నాయి. పైగా నియోజకవర్గం కార్యకర్తలతోను, నాయకులతోను ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశంలో ఎటువంటి […]
BY Pragnadhar Reddy20 April 2015 8:15 PM GMT
Pragnadhar Reddy Updated On: 21 April 2015 6:21 AM GMT
పదవుల కోసం వెంపర్లాట, అధికారం కోసం ఆరాటం… ఈ రెండు రాజకీయ జంప్ జిలానీలను ప్రోత్సహిస్తున్నాయి. ఇవి తెలంగాణలో అటు తెలుగుదేశంలోను, ఇటు కాంగ్రెస్‌లోను కలవరం కలిగిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెరాసలో చేరుతున్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి మద్దతుగా అన్నట్టు ఆయన నియోజకవర్గమంతా కిషన్‌రెడ్డి ఫొటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. మామూలు పోస్టర్లయితే పర్వాలేదు. ఇవన్నీ గులాబి రంగును సంతరించుకున్నాయి. పైగా నియోజకవర్గం కార్యకర్తలతోను, నాయకులతోను ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తామంతా అండగా ఉంటామని కిషన్‌రెడ్డికి వారు అభయమిచ్చినట్టు చెబుతున్నారు. అంటే దాదాపు తెరాసలోకి వెళ్ళడానికి కిషన్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారనవచ్చు. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే తెరాసకు ఆయన చేరువవుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడానికి తెరాస తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు తెరాస పంచన చేరారు. ఇపుడు కొత్తగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండూరి రవీందర్‌రావు తెరాస గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. దీనికి ఇప్పటికే కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా అనేక పదవులు నిర్వహించిన రవీందర్‌కు జిల్లాలో మంచి పేరుంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రవీందర్ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తెరాస వైపు చూస్తున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. అప్కాబ్ ఛైర్మన్ పదవిపై ఆయన కన్నేశారు. తెరాసలో చేరితే తనకు ఆ పదవి వస్తుందన్న భరోసా లభించిన తర్వాతే రవీందర్ ఆ పార్టీ వైపు చూస్తున్నారు. దీనికితోడు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన రవీందర్ చేరికకు పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఎదురు కాలేదు. కాబట్టి ఒకటి రెండు రోజుల్లో రవీందర్ చేరిక ఉండొచ్చని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఈనెల 24న పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా ఈలోగా కొత్త చేరికలను ఖరారు చేసుకోవాలన్న తాపత్రయంలో ఉంది. కేవలం చేరే వారి వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే కాకుండా పార్టీకి కూడా ఉపయోగపడేలా ఈ చేరికలు ఉండాలన్న అధినేత మనోగతాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలోని మిగతా నాయకులు వ్యవహరిస్తున్నారు.-పీఆర్
Next Story