మూడు దశాబ్దాల్లో భారత్ తిరుగులేని శక్తి: చంద్రబాబు
మరో మూడు దశాబ్దాల్లో భారత్ ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి జాతీయ అకాడమీలో శిక్షణలో ఉన్న ఐ.ఎ.ఎస్.లను ఉద్దేశించి ప్రసంగించారు. ఐ.టీ.లో భారత్ అగ్రగామిగా మారుతుందని, ప్రతి దేశం భారత్ సాయం కోసం ఎదురు చూస్తుందని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సింగపూర్, జపాన్, చైనా దేశాల్లో పర్యటించానని… ఒక్కో దేశం అనేక రంగాల్లో అభివృద్ధికి మారుపేరుగా నిలిచాయని… ఆయా దేశాల స్ఫూర్తితో భారత్ కూడా […]
BY Pragnadhar Reddy21 April 2015 1:34 PM IST
Pragnadhar Reddy Updated On: 22 April 2015 2:39 AM IST
మరో మూడు దశాబ్దాల్లో భారత్ ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి జాతీయ అకాడమీలో శిక్షణలో ఉన్న ఐ.ఎ.ఎస్.లను ఉద్దేశించి ప్రసంగించారు. ఐ.టీ.లో భారత్ అగ్రగామిగా మారుతుందని, ప్రతి దేశం భారత్ సాయం కోసం ఎదురు చూస్తుందని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సింగపూర్, జపాన్, చైనా దేశాల్లో పర్యటించానని… ఒక్కో దేశం అనేక రంగాల్లో అభివృద్ధికి మారుపేరుగా నిలిచాయని… ఆయా దేశాల స్ఫూర్తితో భారత్ కూడా పురోగామిగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. ఇన్ఫోసిస్ హైదరాబాద్ రావడానికి తానే కారణమని సీఎం చెప్పుకొచ్చారు. టెక్నాలజీని మనకు అనువుగా మలుచుకుంటే అభివృద్ధి ఫలాలు వేగవంతంగా సాధించవచ్చని తాను నాటి ప్రధాని వాజ్‌పేయికి చెప్పానని, అలాగే తాను చేసిన సూచన ఫలితంగానే కేంద్రం స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. చైనాలో 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్‌పోర్టుకు కేవలం ఏడు నిమషాల వ్యవధిలో చేరుకున్నానని, అలాగే సముద్రంలో 33 కిలోమీటర్ల మేర వంతెన నిర్మించడం చైనా సాధించిన సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఎన్నో విషయాలను తాను చైనా పర్యటనలో గమనించానని… ఇలాంటివన్నీ చేయడానికి భారత్‌లో ఎన్నో అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ప్రధానిగా నరేంద్రమోడి అద్భుత ప్రతిభ కనబరుస్తూ పని చేస్తున్నారని, అలాంటి నాయకులే భారత్ ఇపుడు అవసరమని ఆయన అన్నారు.
Next Story