Telugu Global
Cinema & Entertainment

తమిళ్ లో మరో తెలుగమ్మాయి

కోలీవుడ్ లో ఇప్పటికే చాలామంది తెలుగమ్మాయిలు సత్తా చాటారు. పక్కా తెలుగమ్మాయి స్వాతి, టాలీవుడ్ కంటే ముందు తమిళ చిత్రసీమలోనే పాపులర్ అయింది. ఆ తర్వాతే తెలుగులో విజయాలు వరించాయి. మరో ముద్దుగుమ్మ అంజలి కూడా అంతే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన అంజలికి ఇప్పటికీ కోలీవుడ్ లో క్రేజ్ ఉంది. స్వాతి, అంజలితో పాటు ఈమధ్య కాలంలో శ్రీదివ్య కూడా తమిళనాట బాగా పాపులర్ అయింది. తెలుగులో బస్టాప్, వారధి లాంటి సినిమాల్లో నటించిన శ్రీదివ్యకు […]

తమిళ్ లో మరో తెలుగమ్మాయి
X
కోలీవుడ్ లో ఇప్పటికే చాలామంది తెలుగమ్మాయిలు సత్తా చాటారు. పక్కా తెలుగమ్మాయి స్వాతి, టాలీవుడ్ కంటే ముందు తమిళ చిత్రసీమలోనే పాపులర్ అయింది. ఆ తర్వాతే తెలుగులో విజయాలు వరించాయి. మరో ముద్దుగుమ్మ అంజలి కూడా అంతే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన అంజలికి ఇప్పటికీ కోలీవుడ్ లో క్రేజ్ ఉంది. స్వాతి, అంజలితో పాటు ఈమధ్య కాలంలో శ్రీదివ్య కూడా తమిళనాట బాగా పాపులర్ అయింది. తెలుగులో బస్టాప్, వారధి లాంటి సినిమాల్లో నటించిన శ్రీదివ్యకు కోలీవుడ్ లో ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడీ జాబితాలోకి చేరేందుకు సిద్ధంగా ఉంది తేజస్విని.
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ లో చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకొని అందాల విందు చేసిన తేజస్విని ఇప్పుడు కోలీవుడ్ పై కన్నేసింది. ప్రస్తుతం ఆమె తమిళ్ లో ఓ సినిమా చేస్తోంది. హీరో రాజ్ భరత్ తో చేసిన ఓ స్పెషల్ సాంగ్ కు అక్కడ బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదలైన తర్వాత ఈ పాట క్లిక్కయితే తమిళ్ లో క్రేజ్ తెచ్చుకోవచ్చని భావిస్తోంది తేజస్విని. ఆమె కోలీవుడ్ డ్రీమ్స్ ఏ రేంజ్ లో నెరవేరుతాయో చూడాలి.
First Published:  21 April 2015 7:41 AM IST
Next Story