Telugu Global
Others

భారీ న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు మ‌రోసారి కుప్ప‌కూలాయి. మ‌రో బ్లాక్ మండే అంద‌రికీ గుర్తొచ్చింది. సోమ‌వారం సెన్సెక్స్ 556 పాయింట్లు న‌ష్ట‌పోయి 27886 స్థిర ప‌డింది. అలాగే నిఫ్టి కూడా 158 పాయింట్లు న‌ష్ట‌పోయి 8448 వ‌ద్ద ముగిసింది. గ‌త నాలుగు ట్రేడింగ్ సెష‌న్ల‌లో దాదాపు సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు న‌ష్ట పోయింది. సోమ‌వారం ఉద‌యం సెన్సెక్స్ క‌ద‌లిక‌లు అనుకూలంగానే క‌నిపించాయి. ఈవేళ ఎస్ఆర్ఎఫ్ దాదాపు ఆరు శాతం లాభ‌ప‌డ‌గా హెక్సావేర్, గ్లెన్‌మార్క్‌లు దాదాపు 4 శాతంపైగా లాభ‌ప‌డ్డాయి. హెచ్‌డిఐఎల్‌, […]

స్టాక్ మార్కెట్లు మ‌రోసారి కుప్ప‌కూలాయి. మ‌రో బ్లాక్ మండే అంద‌రికీ గుర్తొచ్చింది. సోమ‌వారం సెన్సెక్స్ 556 పాయింట్లు న‌ష్ట‌పోయి 27886 స్థిర ప‌డింది. అలాగే నిఫ్టి కూడా 158 పాయింట్లు న‌ష్ట‌పోయి 8448 వ‌ద్ద ముగిసింది. గ‌త నాలుగు ట్రేడింగ్ సెష‌న్ల‌లో దాదాపు సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు న‌ష్ట పోయింది. సోమ‌వారం ఉద‌యం సెన్సెక్స్ క‌ద‌లిక‌లు అనుకూలంగానే క‌నిపించాయి. ఈవేళ ఎస్ఆర్ఎఫ్ దాదాపు ఆరు శాతం లాభ‌ప‌డ‌గా హెక్సావేర్, గ్లెన్‌మార్క్‌లు దాదాపు 4 శాతంపైగా లాభ‌ప‌డ్డాయి. హెచ్‌డిఐఎల్‌, టాటా ఎల‌క్సీ, రెలిగేర్‌లు దాదాపు 9 శాతం న‌ష్ట‌పోయాయి. హెచ్‌డీఎఫ్‌సి, కొట‌క్‌బ్యాంక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, డాక్ట‌ర్ రెడ్డీస్‌లో టాప్ ట‌ర్నోవ‌ర్ న‌మోద‌య్యింది.
First Published:  20 April 2015 5:45 AM IST
Next Story