సింగిల్ డేలో సోలో డబ్బింగ్
మాస్ మహారాజ్ రవితేజ నిబద్ధత ఎలా ఉంటుందనేదానికి మరో ఎగ్జాంపుల్ ఇది. సింగిల్ డేలో దాదాపు 90శాతం డబ్బింగ్ పూర్తిచేశాడు రవితేజ. తన కిక్-2 సినిమా ఏమాత్రం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఇలా కష్టపడ్డాడు రవితేజ. కిక్-2 షూటింగ్ పూర్తిచేసుకుంది. అయితే కొన్ని సన్నివేశాల కోసం మళ్లీ రీషూట్ ప్లాన్ చేశాడు. ఈ గ్యాప్ లో మ్యాగ్జిమమ్ డబ్బింగ్ పనులు పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడు రవితేజ. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బింగ్ థియేటర్ లోనే కూర్చున్నాడు. […]
BY Pragnadhar Reddy20 April 2015 2:14 PM IST

X
Pragnadhar Reddy Updated On: 20 April 2015 1:29 PM IST
మాస్ మహారాజ్ రవితేజ నిబద్ధత ఎలా ఉంటుందనేదానికి మరో ఎగ్జాంపుల్ ఇది. సింగిల్ డేలో దాదాపు 90శాతం డబ్బింగ్ పూర్తిచేశాడు రవితేజ. తన కిక్-2 సినిమా ఏమాత్రం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఇలా కష్టపడ్డాడు రవితేజ.
కిక్-2 షూటింగ్ పూర్తిచేసుకుంది. అయితే కొన్ని సన్నివేశాల కోసం మళ్లీ రీషూట్ ప్లాన్ చేశాడు. ఈ గ్యాప్ లో మ్యాగ్జిమమ్ డబ్బింగ్ పనులు పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడు రవితేజ. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బింగ్ థియేటర్ లోనే కూర్చున్నాడు. దాదాపు 90శాతం డబ్బింగ్ పూర్తిచేశాడు. రోజంతా డబ్బింగ్ చేయడమనేది ఎంత కష్టమైన విషయమో సినిమావాళ్లని ఎవరినైనా అడిగితే చెబుతారు. అలాంటి కష్టమైన పనిని ఏమాత్రం ఇబ్బంది పడకుండా పూర్తిచేశాడు మాస్ రాజా. మే రెండోవారంలో కిక్-2ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈలోగా రీషూట్ కూడా పెట్టుకున్నారు. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవ్వకూడదనే ఉద్దేశంతో ఇంత కష్టాన్ని భరించాడు రవితేజ.
Next Story