ఆదాశర్మకు అది అసలు నచ్చదట..!
హార్ట్ ఎటాక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆదాశర్మ.. ఈ మధ్య సన్నాఫ్ సత్యమూర్తి తో తెలుగు అభిమానుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో పెద్ద రోల్ లేక పోయిన ఉన్నంతలో మెప్పించింది. కట్ చేస్తే ఈ ముద్దుగుమ్మ కు తను చేసే రోల్స్ ఎలా ఉండాలి అనే విషయం పట్ల చాల క్లారీటి ఉంది. ఎంతోకొంత నేర్చుకునే రోల్స్ అయితేనే తనకు చాలా ఇష్టమట. అటువంటి పాత్రలు చేయడానికే తను ఇష్టపడుతుందట. గ్లామర్ అనేది పాత్రను బట్టి […]
BY admin20 April 2015 3:10 AM IST

X
admin Updated On: 20 April 2015 9:00 AM IST
హార్ట్ ఎటాక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆదాశర్మ.. ఈ మధ్య సన్నాఫ్ సత్యమూర్తి తో తెలుగు అభిమానుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో పెద్ద రోల్ లేక పోయిన ఉన్నంతలో మెప్పించింది. కట్ చేస్తే ఈ ముద్దుగుమ్మ కు తను చేసే రోల్స్ ఎలా ఉండాలి అనే విషయం పట్ల చాల క్లారీటి ఉంది. ఎంతోకొంత నేర్చుకునే రోల్స్ అయితేనే తనకు చాలా ఇష్టమట. అటువంటి పాత్రలు చేయడానికే తను ఇష్టపడుతుందట. గ్లామర్ అనేది పాత్రను బట్టి , కథ డిమాండ్ మేరకే చూపించడం వుంటుంది తప్పా.. అనవసరంగా ఎవరు చూపించరట..
అది అభిమానులకు కూడా నచ్చదంటూ తన మనసులో మాట చెపేసింది. బన్ని సరసన నటించడం గురించి చెబుతూ..బన్నీ డాన్స్ ,స్టైల్స్ బాగా చేస్తారని చెప్పింది. ఇక లాంగ్వేజ్ పరంగా తనక ఇప్పుడిప్పుడే తెలుగు అర్ధం అవుతుందని, తనకు టాలీవుడ్ బాగా నచ్చిందని కూడా చెప్పేంది. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం లో సోలో హీరోయిన్ గా చేస్తుంది. తెలుగులో మంచి హీరోయిన్ అనిపించుకోవాలనే కోరిక వుందని తెలిపింది.
Next Story